దేవుడి లాంటి వ్యక్తిని కోల్పోయాను – కృష్ణ మేకప్ మ్యాన్

-

దేవుడి లాంటి వ్యక్తిని కోల్పోయానని కృష్ణ మేకప్ మ్యాన్ మాధవరావు అన్నారు. ఆయన చేసిన ప్రతి సినిమా కి నేను మేకప్ వేసాను.. చివరి సారి శ్రీశ్రీ సినిమా కు మేకప్ వేసానని వెల్లడించారు. కృష్ణ గారి వద్ద పని చేయడం గొప్ప వరమని.. మేకప్ వేసే సమయం లో పూర్తిగా మీ ఇష్టం అంటూ మాకు వదిలేస్తారని వెల్లడించారు.

జేమ్స్ బాండ్, కౌ బాయ్, అల్లూరీ సీత రామ రాజు మేకప్ వేయడానికి సమయం పట్టిన ఎంతో ఓర్పు గా ఉండే వారని వివరించారు. ఒక సినిమా కి మేకప్ లేకుండా కృష్ణ గారు నటించాలి అని ఓ కెమెరా మాన్ చెప్పారని.. అలానే నటించడానికి సిద్ధం అయ్యారన్నారు. ప్రతి అరిస్టు ని దేవుడి ల చూస్తారని వెల్లడించారు. కృష్ణ ఒక పుస్తకమని… కృష్ణ గారి నుండి ఈ తరం చాలా నేర్చుకోవాలని తెలిపారు కృష్ణ మేకప్ మ్యాన్ మాధవరావు.

Read more RELATED
Recommended to you

Latest news