నోబెల్ గ్రహీత మలాలా కు వివాహం..

-

నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, బాలికల విద్య కోసం పాటుపడ్డ పాకిస్థాన్ సాామాజికి కార్యకర్త మలాలా యూసుఫ్ జాయ్(24) పెళ్లి చేసుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం బ్రిటన్ లో నివసిస్తున్న మలాలా, ఆమె స్నేహితుడు అసర్ అనే వ్యక్తిని పెళ్లాడింది. తన పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి’ ఈ రోజు నాజీవితంలో అమూల్యమైన రోజు. నేనే, అసర్ జీవితాంతం ఒకరికొకరు ఆసరాగా ఉండేందకు పెళ్లి చేసుకున్నాం‘ అని పేర్కోంది.

2012లో తాలిబన్ల తూటాలకు ఎదురొడ్డి నిలిచింది మలాలా. మలాలా స్కూల్ కు వెళ్తుంటే తాలిబన్లు దాడి చేశారు. తలపై కాల్చడంతో తీవ్ర గాయాలయ్యాయి. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం బ్రిటన్ తరలించారు. అక్కడే ఆమెకు చికిత్స చేశారు. పాక్ లోని వజీరిస్తాన్ స్వాత్ లోయకు చెందిన మలాలా బాలికల విద్య కోసం తాలిబన్లకు ఎదురునిలిచింది. దీంతో తాలిబన్ల ఆమెపై దాడి చేశారు. దాడి సమయంలో ఆమెకు 15 ఏళ్లు. ఈఘటన తర్వాత ఆమె తండ్రికి బ్రిటన్ లోని పాక్ ఎంబసీలో ఉద్యోగం ఇచ్చారు. మలాలాకు 2014 నోబెల్ శాంతి బహుమతి లభించింది. బాలల హక్కుల కోసం ఆమెతో కలిసి పనిచేసిన భారతదేశానికి చెందిన కైలాష్ సత్యార్థి కూడా ఈ అవార్డును అందుకున్నారు. ఈ అవార్డును అందుకున్న అతి పిన్న వయస్కురాలిగా మలాలా యూసఫ్ జాయ్ రికార్డు సృష్టించారు. ఆ సమయంలో ఆమె వయస్సు 17 సంవత్సరాలు.

 

Read more RELATED
Recommended to you

Latest news