నేడు ఎమ్మెల్యేగా ఈట‌ల రాజేందర్ ప్ర‌మాణ‌స్వీకారం

మాజీ మంత్రి, హుజురాబాద్ బిజెపి పార్టీ నేత ఈటెల రాజేందర్ ఇవాళ శాసనసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తెలంగాణ అసెంబ్లీ లో ఇవాళ ఉదయం 11 గంటల సమయంలో హుజురాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈటల రాజేందర్ చేత ఎమ్మెల్యేగా.. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి.. ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

ఈ నేపథ్యంలో ఈటెల రాజేందర్ అసెంబ్లీకి భారీ… ర్యాలీతో రానున్నట్లు సమాచారం అందుతోంది. కాగా అక్టోబర్ 30వ తేదీన జరిగిన హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో… బిజెపి పార్టీ తరఫున ఈటల రాజేందర్ బంపర్ మెజారిటీతో విజయం సాధించారు. సమీప టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ పై… ఏకంగా ఇరవై మూడు వేల పైగా ఓట్ల మెజారిటీతో ఈటెల రాజేందర్ గ్రాండ్ విక్టరీ కొట్టారు. ఇది ఇలా ఉండగా…  తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి గా ఉన్న ఈటెల రాజేందర్ ను మే మాసంలో…  టీఆర్‌ఎస్‌ సర్కార్‌ బర్తరఫ్‌ చేసిన సంగతి తెలిసిందే.