అది చేస్తే బాయ్ ఫ్రెండ్ ఎవరో చెప్తా… మాళవిక మోహన్..!

-

అందాల ముద్దుగుమ్మ మాళవిక మోహన్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇప్పటి వరకు నేరుగా ఒక్క తెలుగు సినిమాలో కూడా నటించిన పోయినప్పటికీ కోలీవుడ్ స్టార్ విజయ్ హీరోగా తెరకెక్కిన ‘మాస్టర్’ సినిమాతో టాలీవుడ్ లో కూడా మాళవిక మోహన్ మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. ఇలా మాళవిక మోహన్ నటించింది తక్కువ సినిమాలే అయిన ఈ ముద్దుగుమ్మ సినిమాల కంటే ఎక్కువగా సోషల్ మీడియా లొనే యాక్టివ్ గా ఉంటుంది.

మాళవిక మోహన్ ఎప్పటికప్పుడు హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటో షూట్ లను నిర్వహిస్తూ వాటికి సంబంధించిన ఫోటోలను, వీడియో లను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కుర్రకారును వేడెక్కిస్తు ఉంటుంది. ఇదిలా ఉంటే తాజాగా మాలవిక మోహన్ ఒక వీడియోను తన ఇన్‌స్టా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ వీడియో లో భాగంగా మాల్దీవులు ట్రిప్‌ను పూర్తి చేసిన మాళ‌వికా మోహ‌న‌న్‌ ను ట్రిప్ ఎలా జరిగింది అని ప్ర‌శ్నిస్తే..? చాలా బాగా ఎంజాయ్ చేసాము అని సమాధానం ఇచ్చింది.

అదే సమయంలో త‌న‌కు బాంబేకి చెందిన ఓ కంపెనీ ఇచ్చిన గిఫ్ట్‌ను ఈ వీడియోలో మాళవిక మోహన్ చూపించింది. ఆ గిఫ్ట్ ఏంటా అని అనుకుంటున్నారా..? అదొక షేవింగ్ కిట్. ఇది మ‌గ‌వాది క‌దా… ఎవరి కోసం తీసుకున్నావు… అంటే నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా..? అని ప్ర‌శ్నిస్తే… మాళవిక మోహన్ అవును ఉన్నాడు అని మాళవిక మోహన్ సమాధానం ఇచ్చింది. దానితో ఆ బాయ్ ఫ్రెండ్ ఎవరో చెప్పాలి అంటే… ఇప్పుడు పోస్ట్ చేసిన వీడియోకు వ‌న్ మిలియ‌న్ ( 10 లక్షల) వ్యూస్ వ‌స్తే… ప్ర‌మాణ పూర్తిగా నా బాయ్ ఫ్రెండ్ ఎవ‌రో చెబుతాను’ అంటూ మాళవిక మోహన్ సమాధానం ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news