కర్ణాటక ఫలితాలపై దీదీ సంచలన వ్యాఖ్యలు

-

కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన మ్యాజిక్‌ ఫిగర్‌ దాటేసింది. 136 స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. అయితే.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో బీజేపీ ఘోర పరాజయంపై టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. కాంగ్రెస్‌కు శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి బీజేపీ అంతం మొదలైందని వ్యాఖ్యానించారు. ‘‘కర్ణాటక ప్రజలకు, ఓటర్లకు నేను సెల్యూట్ చేస్తున్నా. విజయం సాధించిన వారికీ నా సెల్యూట్. త్వరలో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ కూడా బీజేపీ ఓడిపోతుందని అనుకుంటున్నా. బీజేపీ అంతానికి ప్రారంభం ఇదే’’ అంటూ మమతా బెనర్జీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘అసలు వాళ్లకు (బీజేపీ) ఓట్లు ఎక్కడి నుంచి వస్తాయి? యోగి రాజ్యం, అరాచకరాజ్యం ఉన్న యూపీలో కొన్ని సీట్లు గెలుచుకోవచ్చు.

Bengal CM Mamata Banerjee Apologises For TMC Minister's Remarks On  President Droupadi Murmu

కానీ అక్కడ ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ప్రతిపక్షం బలంగా లేదు కానీ అఖిలేశ్ (యాదవ్) ఈసారి గట్టి పోటీనే ఇస్తారు. నేను ఆయన వెంట ఉంటా. కాబట్టి యూపీ, గుజరాత్‌లో పరిస్థితి బీజేపీకి అనుకూలంగా ఉండొచ్చు. అలాగే హరియాణాలో ఓ మూడు నాలుగు సీట్లు రావచ్చు. ఇవి మినహా వారికి సీట్లు ఎక్కడి నుంచి వస్తాయి? దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు; ఈశాన్య రాష్ట్రాలైన బీహార్, బెంగాల్, ఝార్ఖండ్, ఒడిశా, ఆ తరువాత ఢిల్లీ.. ఎక్కడైనా బీజేపీకి వ్యతిరేక పవనాలే. అప్పట్లో బీజేపీ పీక్స్‌లో ఉంది. 275 అంతకు మించి సీట్లు సాధించుకుంది. కానీ ఈ మారు 100 సీట్లు కూడా దాటే పరిస్థితిలేదు’’ అంటూ బీజేపీ భవిష్యత్తును ఆవిష్కరించారు మమతా బెనర్జీ

Read more RELATED
Recommended to you

Latest news