సీఎం కేసీఆర్ కు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఫోన్

-

తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ కు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఫోన్ చేసినట్లుగా తెలుస్తోంది. దేశంలో తాజా రాజకీయ పరిణామాలపై ఇద్దరు నేతలు చర్చించినట్లుగా తెలిసింది. సమాఖ్య స్ఫూర్తిని కాపాడేందుకే ఇద్దరు పలు అంశాలపై చర్చించిస్తున్నామని మమతా బెనర్జీ అన్నారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ తీరుపై చర్చించారు. ఎన్డీయేతర ముఖ్యమంత్రుల సమావేశం గురించి కూడా ఇరు నేతలు చర్చించారు.

నిన్న సీఎం కేసీఆర్ కూడా ఎన్డీయేతర ముఖ్యమంత్రుల సమావేశంపై స్పందించారు. బీజేపీ ప్రభుత్వం గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తుందని మండిపడ్డారు. త్వరలో మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే, తమిళనాడు సీఎం స్టాలిన్ తో సమావేశం అవుతాన్నారు. వీరిద్దరు ఫోన్ లో టచ్ లో ఉన్నట్లు వెల్లడించారు. జాతీయ స్థాయిలో బీజేపీని అడ్డుకునేందుకు సమాయత్తం అవుతామన్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా అక్కడి గవర్నర్ తీరును తప్పుపడుతూ.. ట్విట్టర్ లో కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. త్వరలోనే ఢిల్లీలో ఎన్డీయేతర రాష్ట్రాల సీఎంలతో భేటీ ఉంటుందని.. దీదీ తనకు కూడా ఫోన్ చేశారని ట్విట్టర్ లో వెల్లడించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news