నేటి సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా ఎన్నో జీవితాలు సర్వ నాశనమైపోతున్నాయి. నిండు జీవితాన్ని అర్థాంతరంగా ముగిం చేసుకుంటున్నారు. వీటి వలన చనిపోతున్న వారు కొందరు అయితే తమా భాగస్వాములని చంపేస్తోన్న వారు మరికొందరు. తాజాగా చిత్తూరు జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. భార్యకు అక్రమ సంబంధాలు ఎక్కువ అయిపోవడంతో భర్త ఆత్మహత్య చేసుకున్నాడు.
అయితే తాను మాత్రమే చావకుండా కూతురుని ఉరేసి చంపి ఆపై ఆత్మహత్య చేసుకున్నాడు. తన భార్య పలువురుతో అక్రమ సంబంధం పెట్టుకుందని మనస్తాపం చెందిన గణేష్ అనే వ్యక్తి చిత్తూరులోని ఓ లాడ్జిలో ఆత్మహత్య చేసుకున్నాడు. నాలుగున్నర ఏళ్ల వయసున్న కుమార్తెను ఉరేసి చంపిన గణేష్ ఆపై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మృతదేహాలని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.