నదిలో గానీ, సరస్సులో గానీ కాయిన్స్ ఎందుకు వేస్తారో తెలుసా..?

-

ఏదైనా పుణ్యక్షేత్రం వెళ్ళినపుడు అక్కడ స్నానమాచరించడానికి కోనేరు, నది, సరస్సులోకి వెళ్తుంటారు. ఆ సమయంలో అందరూ భక్తి శ్రద్ధలతో నదిలో స్నానం చేసి దేవుడి దర్శనానికి బయలు దేరుతారు. స్నానం చేసేటపుడు కొందరు నదిలో దీపాలు వదులుతారు. మరికొందరు నదిలోకి కొబ్బరి కాయలు, చిల్లర నాణేలు పడవేస్తారు. చాలా మందికి ఒక అనుమానం ఉంటుంది. నదిలో నాణేలు వేయడానికి ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందా? లేదా అందరూ వేస్తున్నారు కాబట్టి వేయాలా? లేక దేవుడి దర్శనానికి వచ్చాం కాబట్టి, ఇలా చేయాలని చేస్తున్నారా అన్న సందేహం ఉంటుంది.

నిజానికి ఇలాంటి విషయాల సరైన సమాధానాలు కూడా చెప్పరు. ముఖ్యంగా చిన్నపిల్లలు ఇలాంటి ప్రశ్నలు అడిగినపుడు పెద్దలు చెప్పకుండా అలాంటి ప్రశ్నలు అడగద్దంటూ దాటవేస్తారు. కానీ సమాధానం కోసం వెతకరు. అలాంటి వారికోసం అసలు చిల్లర నాణేలు నదిలో ఎందుకు వేస్తారో తెలుసుకుందాం.

దీనివెనక పెద్ద శాస్త్రీయతే ఉంది. నిజానికి నాణేలు వేయడం అనే అలవాటు రాగినాణేలు చలామణిలోకి వచ్చిన తర్వాత మొదలైంది. రాగి నాణేలని నదిలో వేయడం వల్ల నదినీరు శుభ్రంగా మారుతుంది. రాగికి ఆ గుణం ఉంది. నీటిని శుభ్రపరిచే గుణం రాగికి ఉంది కాబట్టి, నదిలో నీళ్ళు శుభ్రం అవుతాయని, దానివల్ల తాగడానికి బాగా పనికొస్తాయని అలా చేసేవారు. అప్పట్లో నది నీరే తాగడానికి ఉపయోగించేవారు. ఇప్పటిలాగా ఫిల్టర్లు లేవు కనుక రాగినాణేలని అందులో వేసి ఆ నీటిని శుభ్రపరిచేవారన్న మాట.

ప్రస్తుతం రాగి నాణేలు లేవు. అందువల్ల మనం వాడుతున్న నాణేలని నదిలో వేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు వాడుతున్న వాటిని నదిలో వేయడం వల్ల అవి తుప్పుపట్టి నది నీళ్ళు పాడయ్యే ప్రమాదం ఉంది. కొబ్బరి కాయలు కొట్టి మరీ నదిలోకి విసిరేయడమ్ కరెక్ట్ కాదు. వీటన్నింటి వల్ల నది నీళ్ళు పాడవుతున్నాయని ప్రకృతి ప్రేమికులు అనుక్షణం హెచ్చరిస్తూనే ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news