ఈ నెల 8 వ తేదీన ప్రియాంక గాంధీ తెలంగాణకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మాణిక్ రావ్ థాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగు రాష్ట్రాలలో SC, ST మరియు BC కులాల అభివృద్ధి కోసం చాలా చేశారు. ఇక అపటితో ఆగిపోయిన అభివృద్ధి తప్పించి తెలంగాణలో కేసీఆర్ చేసినది ఏమీ లేదని కొట్టిపారేశాడు. మేము ఏవైతే మొదలు పెట్టామో..వాటిని BRS కొనసాగిస్తోంది తప్పించి కొత్తగా తీయకువచినవి ఏమీ లేవు. ఇప్పటి వరకు కేసీఆర్ అధికారంలోకి వచ్చి 9 సంవత్సరాలు అవుతోంది, ఇప్పటి వరకు తెలంగాణ యువత కోసం కేసీఆర్ చేసినవి ఏమైనా ఉంటే చెప్పమనండి అంటూ థాక్రే ఫైర్ అయ్యారు. ఎంతసేపు తన స్వార్థమే చూసుకుంటూ ఉన్నారని … యువత గురించి పట్టించుకునే వారే కరువయ్యారని మండిపడ్డారు థాక్రే.
మరో రెండు రోజుల్లో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఈ తెలంగాణలో వచ్చి యువతకు భరోసా ఇచ్చే విధంగా వారితో డైరెక్ట్ గా మాట్లాడుతారని చెప్పారు. ఇకనైనా కేసీఆర్ బుద్ది తెచ్చుకుని మిగిలిన ఈ కాస్త సమయం అయినా యువతకు ఏమైనా ప్రయోజనాలను చేకూర్చే పథకాలను తీసుకు రావాలని అన్నారు.