మ‌ణిపూర్ పోలింగ్ హింసాత్మ‌కం.. కాల్పుల్లో బీజేపీ నేత మృతి

-

ఈశాన్య రాష్ట్రం అయిన మ‌ణిపూర్ లో నేడు జ‌రిగిన రెండో విడ‌త పోలింగ్ లోనూ హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి. బీజేపీ కార్య‌కర్త‌లపై కొంత మంది దుండ‌గులు కాల్పులు జ‌రిపారు. దీంతో మ‌ణిపూర్ రాష్ట్రానికి చెందిన అముబా సింగ్ ప్రాణాలు కోల్పోయారు. దీంతో మ‌ణిపూర్ రాష్ట్రంలో ఉద్రిక్తత ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల కార్య‌క‌ర్తల మ‌ధ్య ప‌లు చోట్ల ఘ‌ర్షణ వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది. కాగ నేడు మ‌ణిపూర్ రాష్ట్రంలో చివ‌రి ద‌ఫా ఎన్నిక‌లు జ‌రిగాయి. ఈ రోజు మొత్తం 22 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జ‌రిగాయి.

అధికారిక లెక్కల ప్రకారం.. ఈ రోజు మ‌ధ్యాహ్నం 3 గంట‌ల వ‌ర‌కు 67.77 శాతం పోలింగ్ న‌మోదు అయింది. కాగ ఈ రోజు ఉద‌యం 7 గంట‌ల నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు పోలింగ్ జ‌రిగింది. కాగ మొత్తం పోలింగ్ శాతాన్ని ఎన్నిక‌ల అధికారులు కాసెప‌ట్లో ప్ర‌క‌టించనున్నారు. అయితే మొద‌టి ద‌ఫా జ‌రిగిన ఎన్నిక‌ల్లోనే హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి.

కాగ ఈ రోజు జ‌రిగిన రెండో విడ‌త ఎన్నిక‌ల్లో ఎకంగా కాల్పులే జ‌రిగియి. ఈ ఘ‌ట‌న‌లో బీజేపీ కార్య‌క‌ర్త అముబా సింగ్ మృతి చెందారు. కాగ కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లే అముబా సింగ్ పై కాల్పులు జ‌రిపి హత్య చేశార‌ని బీజేపీ కార్య‌కర్తలు ఆరోపిస్తున్నారు. కాగ ఈ కాల్పుల ఘ‌ట‌న పోలీసులు ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news