శాంతి చర్చలకు సిద్ధం పై మావోయిస్టులు కీలక ప్రకటన చేశారు. మావోయిస్టులు సంచలన ప్రకటన చేశారు. శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చలకు సానుకూల వాతావరణం ఏర్పాటు చేస్తే.. కాల్పుల విరమణకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

మావోయిస్టు కేంద్ర అధికార ప్రతినిధి అభయ్ పేరుతో ఈ లేఖ వచ్చింది. తమ ప్రతిపాదనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించాలని.. ఛత్తీస్ గఢ్, ఒడిశా, తెలంగాణల్లో హింసాకాండను ఆపాలని డిమాండ్ చేశారు.