TSPSC పేపర్ లీకేజీలో మాస్టర్ మైండ్ ఆమెదే

-

రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే ఈ వ్యవహారం వెనుక మాస్టర్ మైండ్ అంతా గురుకులంలో టీచర్​గా పనిచేస్తున్న రేణుకదేనని అధికారులు గుర్తించారు. తమ్ముడి పేరుతో క్వశ్చన్ పేపర్లు సంపాదించేందుకు రేణుక రాఠోడ్‌ తెరవెనుక పెద్ద తతంగమే నడిపినట్టు తెలిపారు. రేణుక.. ముందుగానే అభ్యర్థులతో బేరం కుదుర్చుకొని రూ.లక్షలు కాజేసేందుకు వ్యూహరచన చేసినట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తన సోదరుడు రాజేశ్వర్‌కు ఏఈ ప్రశ్నపత్రాలు కావాలంటూ రూ.10 లక్షలకు ప్రవీణ్‌తో బేరం కుదుర్చుకుంది. వాస్తవానికి అతను టీటీసీ చదివాడు. కాంట్రాక్టు పనులు చేస్తున్నాడు. ఏఈ పరీక్ష రాసేందుకు అర్హత లేదు. అయినా అతని కోసం క్వశ్చన్ పేపర్ కావాలని రేణుక ప్రవీణ్​కు చెప్పింది.

మరోవైపు క్వశ్చన్ పేపర్లు సమకూరుస్తానంటూ మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన కె.నీలేష్‌నాయక్‌, పి.గోపాల్‌ నాయక్‌లతో రేణుక రూ.14 లక్షలకు బేరం కుదుర్చుకుంది. వారి వద్ద డబ్బు తీసుకుని ప్రవీణ్‌కు ఇచ్చింది. రేణుక ఇచ్చిన రూ.10 లక్షల్లో కొంత ఇస్తానని చెప్పి.. పొరుగుసేవల ఉద్యోగి రాజశేఖర్‌కు ప్రవీణ్‌ డబ్బు ఆశచూపి క్వశ్చన్ పేపర్ సంపాదించాడు. ఇంతలోనే బండారం బయటపడింది.

Read more RELATED
Recommended to you

Latest news