తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త జూపల్లి రామేశ్వరరావు.. ఏపీలోని అధికార వైసీపీ పార్టీలోకి వెళ్లనున్నట్లు సమాచారం అందుతోంది. ఏపీ నుంచి త్వరలోనే ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాలు అధికార వైసీపీ పార్టీకే దక్కనున్న సంగతి విధితమే.
రాజ్యసభ స్థానాలను వైసీపీ అధినేత, సీఎం జగన్ పలువురి నేతలకు గతంలో హామీలు ఇచ్చినప్పటికీ.. వీటికి తీవ్రమైన పోటీ నెలకొనడంతో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎవరికీ అవకాశం కల్పిస్తారు అనేది ఉత్కంఠంగా మారింది.
పార్టీ నేతలు పలువురు ఈ పదవులపై ఆశ పెట్టుకోగా.. పలువురు పారిశ్రామిక వేత్తలు సైతం జగన్ మోహన్ రెడ్డిని సంప్రదిస్తున్నారు. ఇంతకు ముందు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సిఫార్సు మేరకు పరిమళ్ నత్వానికి జగన్ అవకాశం ఇచ్చారు. ఈ సారి ఇదే విధంగా మరో పారిశ్రామిక దిగ్గజం ఆదానీ గ్రూపు అధినేత గౌతమ్ ఆదానీ సతీమణికి ఛాన్స్ ఇస్తారని సమాచారం అందుతోంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.