మేడారం మహాజాతరకు నిధుల విడుదల.. వచ్చే ఏడాది జరుగనున్న సమక్క సారలమ్మ జాతర

రెండేళ్లకు ఒక సారి జరిగే మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతరకు ఏర్పాట్లు ప్రారంభమవుతున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో మహాజాతర జరుగనుంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జరిగే మహాజాతరకు ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతను ఇస్తుంది. అయితే తాజాగా జాతరకు అవసమయ్యే నిధులను ప్రభుత్వం విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే ఏడాది జరుగనున్న మహాజాతరకు రూ. 75 కోట్లను విడుదల చేసింది. జాతరకు అవసరమ్యే మౌళిక సదుపాయాలు రోడ్లు, విద్యుత్, స్నాన ఘట్టాలు, తాగు నీరు, మరుగుదొడ్లు మొదలైన వాటికి నిధులను ఖర్చు చేయనున్నారు.

రెండేళ్లకు ఒక సారి జరిగే మహాజాతర కోసం ఇటీవల రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ ఆధ్వర్యంలో కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. కాగా ఈసమావేశంలో మేడారం జాతర కోసం రూ. 110 కోట్ల నిధులు అవసమవుతాయని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అయితే ప్రతిపాదనలను పరిశీలించిన రూ. 75 కోట్లను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.