వచ్చే ఏడాదిలోపు మిగిలిన 17 జిల్లాలలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు – సీఎం కేసీఆర్

-

రాష్ట్రంలో నూతనంగా నిర్మించిన ఎనిమిది మెడికల్ కాలేజీలను ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ప్రగతి భవన్ నుంచి ఆన్లైన్ ద్వారా ఒకేసారి 8 మెడికల్ కాలేజీ లలో విద్యా బోధన తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఒకనాడు తెలంగాణ రాష్ట్రం అనేక సమస్యలతో ఎన్నో రకాల అవస్థలు పడిందని.. కానీ ఇప్పుడు వైద్య రంగంలో దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందన్నారు.

మహబూబాబాద్, వనపర్తి లాంటి ప్రాంతాల్లో మెడికల్ కాలేజీలు వస్తాయని ఎన్నడూ అనుకోలేదన్నారు. స్వరాష్ట్రం ఏర్పడింది కాబట్టే ఇవ్వాళ ఇన్ని మెడికల్ కాలేజీలు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. మంత్రి హరీష్ రావు తో పాటు…వైద్య శాఖకు శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలిపారు సీఎం కేసీఆర్. ఇప్పుడు రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు 18కి పెరిగాయని.. వచ్చే ఏడాది వరకు మిగిలిన 17 జిల్లాలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకుందామన్నారు. గతంతో పోల్చితే మూడు రేట్ల మెడికల్ సీట్ల కెపాసిటీ పెరిగిందని తెలిపారు.

మెడికల్, పీజీ, సూపర్ స్పెషాలిటీ సీట్లు తెలంగాణ రాష్ట్రంలో ఘనంగా పెరిగాయన్నారు. దళిత, గిరిజన, బడుగు బలహీన వర్గాలకు ఇది మంచి అవకాశమన్నారు సీఎం కేసీఆర్. జనాభా ప్రాతిపదికన వైద్య రంగంలో తెలంగాణ రాష్ట్రం పటిష్టంగా ఉందన్నారు. ప్రతీ జిల్లాకు వైద్యం అందేలా.. వైద్య రంగం అడుగులు వేస్తోందని వెల్లడించారు. చిల్లర రాజకీయాలు చేయకుండా మిషన్ భగీరథ, కాకతీయ తరహాలో ప్రతీ గ్రామానికి వైద్యం అందాలని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news