టిష్యూకల్చర్ చెరకు సాగుతో బోలెడు లాభాలు..

-

మన దేశంలో ఎక్కువగా పండిస్తున్న వాణిజ్య పంటలలో ఒకటి చెరకు..నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో చెరకు పంటను సాగుచేపడుతు,అధిక లాభాలను పొందుతున్నారు రైతులు..ఇటీవలి కాలంలో పంటను పురుగులు, తెగు ళ్ళ నుండి కాపాడుకునేందుక సరికొత్త విధానంలో సాగు చేపడుతున్నారు.చెరకులో గడల నుంచి వ్యాపించే తెగుళ్ళు, పురుగుల తాకిడి అధికంగా ఉంటుంది. వీటిని నిరోధించటానికి టిష్యూకల్చర్ పేరుతో సరికొత్త పద్దతిలో సాగు చేపడుతున్నారు.

ఈ విధానంలో వేల మొక్కలను జన్యుస్వచ్ఛత దెబ్బతినకుండా ఏకరీతిగా, బలమైన, ఎర్రకుళ్ళు, గడ్డి దుబ్బుతెగులు ఆశించనటువంటి మొక్కలను ప్రయోగశాలలో ఉత్పత్తి చేస్తారు. పలు దేశాల్లో ఈ పద్దతి ద్వారా వాణిజ్య పరంగా చెరకు మొక్కలను అభివృద్ధి చేస్తున్నారు. భారతదేశంలో ప్రస్తుతం ఈ పద్ధతిని నెమ్మదిగా చెరకు సాగు చేసే రైతులు అనుసరిస్తున్నారు.. ఇలా మంచి లాభాలను కూడా అర్జిస్తున్నారు..

ఈ పద్దతిలో జీవపదార్థాలు, కణాలు, కణజాలాలు లేదా వాటి భాగాలను ప్రత్యేకంగా పత్యామ్నాయ పద్ధతి తయారుచేసిన పదార్థంలో సూక్ష్మ జీవరహిత స్థితిలో పెంచినప్పుడు అవి పూర్తి మొక్కలను ఇస్తాయి. ఇది వృక్ష కణాల్లో మాత్రమే సాధ్యపడుతుంది. ఈ విధంగా కొత్త మొక్కలను తయారుచేసే ప్రయోగ పద్ధతులన్నింటిని కలిపి టిష్యూకల్చర్ గా పిలుస్తారు. టిష్యూ కల్చర్ ద్వారా సమర్థవంతమైన, వ్యాధి రహిత మొక్కలను తక్కువ ధరకే తయారు చేయవచ్చు. మొక్కల కాండం శిఖరాగ్రాన్ని ఉపయోగించి వైరస్ రహిత, ఆరోగ్యవంతమైన మొక్కలను తయారుచేయడం ద్వారా సాధ్యమవుతుంది..

ఈ పద్దతి ద్వారా వచ్చిన మొక్కలు జన్యు స్వచ్ఛత కలిగి నూటికి నూరు శాతం తల్లి మొక్కలను పోలి ఉంటాయి. వీటి పునరుత్పత్తి వేగవంతంగా ఉంటుంది. మొక్కలన్నీ ఏకరీతిగా వైరస్ తెగుళ్ళ ఆశించకుండా ఉంటాయి. అధిక మొలక శాతం కలిగి , త్వరగా మొలకెత్తుతుంది. మొక్కలోని గడలన్నీ ఒకేసారి పక్వానికి వస్తాయి.. ఒకేసారి కోతకు వస్తాయి..టిష్యూ కల్చర్ మొక్కలు సంవత్సరం మొత్తం ఉత్పత్తి చేసుకోవచ్చు. రైతుకు ఎప్పుడు అవసరం వస్తుందో అప్పుడు మొక్కలని సరఫరా చేయవచ్చు. ఈ విధానంలో విత్తన వృద్ధి రేటు సాంప్రదాయ పద్ధతి కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. కణజాల వర్ధనం ద్వారా ఏర్పడిన మొక్కలు నాజూకుగా, సున్నితంగా ఉంటాయి.అన్నీ వాతావరణ పరిస్థితుల లో పెరుగుతాయి..

Read more RELATED
Recommended to you

Latest news