విద్యార్థులకు శుభవార్త.. తెలంగాణలో భారీగా పెరగనున్న మెడికల్‌ సీట్లు

-

మెడిసిన్‌ చదివే విద్యార్థులకు శుభవార్త చెప్పింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్ప‌టి వ‌ర‌కు 750 ప్ర‌భుత్వ మెడిక‌ల్ సీట్ల‌ను వ‌చ్చే సంవంత్స‌రం నుంచి 2850 కు పెంచ‌బోతున్నామని అసెంబ్లీ లో మంత్రి హారీష్ రావు ప్రకటన చేశారు. 60 ఏళ్ళ లో తెలంగాణ లో 3 ప్ర‌భుత్వ మెడిక‌ల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే ..6 ఏళ్ళ‌లో 33 మెడిక‌ల్ కాలేజీలు ఏర్పాటు చేసామని… కేంద్రం తెలంగాణ కు ఓక్క మెడిక‌ల్ కాలేజి కూడా ఇవ్వ‌లేదని నిప్పులు చెరిగారు.

నిమ్స్ లో ప్ర‌స్తుతం 1400 ప‌డ‌క‌లు ఉన్నాయి .. మ‌రో 2 వేల ప‌డ‌క‌లు అద‌నంగా ఏర్పాటు చేస్తామన్నారు. మెడిక‌ల్ కాలేజీల‌లో డెడ్ బాడీల కొర‌త ఉందని.. చ‌ట్ట స‌వ‌ర‌ణ చేసి డెడ్ బాడీల‌ను మెడిక‌ల్ కాలేజీల‌కు అందుబాటులో ఉంచుతామని చెప్పారు. కొత్త‌గా ఏర్పాటు చేసిన 8 మెడిక‌ల్ కాలేజీల‌ లో ఈ సంవత్స‌రమే క్లాసులు ప్రారంబిస్తామని వెల్లడించారు. అలాగే… వచ్చే ఏడాది నుం చే… సొంత జాగలో ఇళ్లు కట్టుకునే వారికి ప్రభుత్వమే రూ.3 లక్షలు ఇస్తాందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news