ఈమధ్య కాలంలో మెగా హీరోల పెళ్లిల విషయంలో సమయం అస్సలు బాగా సాగడం లేదని చెప్పవచ్చు. ఒకవైపు పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు , విడాకులతో ఇబ్బంది పడుతుంటే ఆయన అన్న కూతురు శ్రీజ కూడా ఇప్పుడు మూడో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అసలు ట్విస్ట్ ఏమిటంటే మెగా హీరో చిరంజీవి చిన్న కూతురు శ్రీజ రెండవ భర్త కళ్యాణ్ దేవ్ వివాహం చేసుకోబోతున్నాడు అనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.. కానీ ఆయన ఈసారి ఏకంగా తన మరదల్ని వివాహం చేసుకోబోతున్నాను అంటూ ట్విస్ట్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు.ఇకపోతే గత కొద్ది రోజుల నుంచి కళ్యాణ్ దేవ్, శ్రీజ ల రిలేషన్ బ్యాడ్ షేప్ తీసుకుంది.. ఇక వారు ఎడమొహం పెడముఖంగా ఉంటున్నారు .. ఇంకా చెప్పాలి అంటే వీరిద్దరు విడిపోయి కొన్ని నెలలు గడుస్తోంది. శ్రీజ తన తండ్రి చిరంజీవి దగ్గరే ఉండగా కళ్యాణ్ దేవ్ తన సొంత ఇంటికి వెళ్లిపోయారు. ఇక గతంలో ఆయన కూడా శ్రీజ తో పాటు చిరంజీవి ఇంట్లోనే ఉండేవాడు. కానీ ఇలా బ్రేకప్ అయ్యేసరికి తన సొంత ఇంటికి వెళ్లిపోయాడు. అధికారికంగా ఇద్దరూ విడాకులు తీసుకొని చాలా రోజులు అవుతుంది. ఇప్పుడు మూడో పెళ్లికి సిద్ధమవుతోంది శ్రీజ. ఇక కళ్యాణ్ – శ్రీజలకు జన్మించిన కూతురు తల్లి దగ్గరే ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల ఆ పాప కూడా తన తండ్రిని కలుస్తూ ఉండడం గమనార్హం. కళ్యాణ్ దేవ్ కూడా తన కూతురితో కలిసి ఎంజాయ్ చేసిన ప్రతి మూమెంట్ ను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ వస్తున్నాడు. ఇక విడాకులు తీసుకున్నప్పటికీ కన్న కూతుర్ని కలిసే అవకాశం తండ్రికి కోర్టు కల్పిస్తుంది అన్న విషయం అందరికీ తెలిసిందే.
శ్రీజ కంటే ముందే తాను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్న కళ్యాణ్ దేవ్ దగ్గర బంధువులకు చెందిన మరదలు వరస అయ్యే అమ్మాయి మెడలో కళ్యాణ్ దేవ్ తాళికట్టబోతున్నాడట. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త బాగా వినిపిస్తూ ఉండడం గమనార్హం.