“మెగా52” అప్డేట్ : ప్రీ-లుక్ పోస్టర్‌ అదుర్స్.. ఫస్ట్ లుక్ ఎప్పుడంటే..?

-

మెగాస్టార్ చిరంజీవి తన 65వ పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వబోతున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిరంజీవి 152వ చిత్రం ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను ఆగస్టు 22న సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని ఆ సినిమా నిర్మాత రామ్ చరణ్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన ప్రీ-లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో హీరో చేతిలో ఎర్రటి కండువా ఉంది.

అలాగే చిరంజీవి ఈ సినిమాలో డ్యూయల్ రోల్లో యాక్ట్ చేయనున్నట్టు సమాచారం. ఇకపోతే ఈ  సినిమాలో ఒక కీలక పాత్రలో రామ్ చరణ్ లేదా రానా కనిపించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్‌తో కలిసి కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఆచార్య పేరుతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news