టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి..నటించిన ‘ఆచార్య’ చిత్రం భారీ అంచనాల నడుమ గత నెల 29న విడుదలైంది. అయితే, ఈ మూవీ అనుకున్న అంచనాలను అయితే అందుకోలేకపోయింది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫిల్మ్ లో మెగాస్టార్ చిరు తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘సిద్ధ’ అనే ఫుల్ లెంగ్త్ రోల్ ప్లే చేశాడు. తండ్రీ తనయులను వెండితెర మీద చూసి జనాలు ఫిదా అయ్యారు.
నిజానికి ‘ఆచార్య’ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సింది. కానీ, కరోనా మహమ్మారి వలన పిక్చర్ రిలీజ్ ఆలస్యమవుతూ వచ్చింది. ఎట్టకేలకు విడుదలైన చిత్రం అంచనాలను అయితే అందుకోలేకపోయింది. ఈ క్రమంలోనే మెగాస్టార్ తన నెక్స్ట్ ఫిల్మ్స్ రిలీజ్ పైన మేకర్స్ తో చర్చిస్తున్నట్లు ఫిల్మ్ నగర్ సర్కిల్స్ టాక్.
‘ఆచార్య’ తర్వాత రెండు లేదా మూడు నెలల గ్యాప్ తోనే రెండు సినిమాలు విడుదల చేయాలని తొలుత అనుకున్నారట మెగాస్టార్. కానీ, ప్రస్తుతం ఏర్పడ్డ పరిస్థితుల నేపథ్యంలో నెక్స్ట్ మూవీల్లో స్టోరి ప్లస్ కమర్షియల్ ఎలిమెంట్స్ పైన ఫుల్ ఫోకస్ పెట్టాలని చిరు భావిస్తున్నారట.
అలా ఈ ఏడాది విడుదల కావాల్సిన ‘గాడ్ ఫాదర్, భోళా శంకర్’ సినిమాల్లో ‘గాడ్ ఫాదర్’ మాత్రమే రిలీజ్ అయ్యే చాన్సెస్ ఉన్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి..ఏం జరుగుతుందో..