తన లైఫ్​లో ఇంపార్టెంట్ వ్యక్తిని పరిచయం చేసిన మెగా డాటర్ శ్రీజ

-

మెగా డాటర్ శ్రీజ సోషల్ మీడియాలో యమా యాక్టివ్. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి తరచూ ఇన్‌స్టా వేదికగా పోస్టులు పెడుతుంటుంది. డే టు డే లైఫ్‌, ఫిట్‌నెస్‌ గురించి ఎక్కువగా పోస్టులు పెట్టే ఆమె తాజాగా చేసిన ఓ పోస్ట్‌ సోషల్ మీడియాలో కాస్త సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. తన లైఫ్​లో చాలా ఇంపార్టెంట్ వ్యక్తిని పరిచయం చేస్తూ అందరికీ ఆమె న్యూ ఇయర్‌ విషెస్‌ చెప్పింది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరంటే..?

‘‘డియర్‌ 2022.. నా జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తిని నాకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. కష్ట సుఖాల్లో నన్ను ఎంతగానో అర్థం చేసుకునే, అమితంగా ప్రేమించే, అన్ని విధాలుగా సంరక్షించే ఆ వ్యక్తి మరెవరో కాదు నేనే. ఈ ఏడాది నా గురించి నేను ఎక్కువగా తెలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ ప్రయాణం మొదలైంది’’ అని ఆమె రాసుకొచ్చారు. #SelfConnection, #Innerpeace అనే ట్యాగ్‌లను ఆమె జత చేశారు. వ్యక్తిగత ప్రేమను ఉద్దేశిస్తూ ఆమె పెట్టిన ఈ పోస్ట్‌పై పలువురు నెటిజన్లు స్పందిస్తూ.. ‘‘మీరు చెప్పింది నిజమే వ్యక్తిగత ప్రేమ అన్నింటికంటే ఎంతో ముఖ్యం’’, ‘‘#Selfcareకు మనం ప్రాధాన్యత ఇవ్వాలి’’ అని కామెంట్స్‌ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news