మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు నిరాశ..!!

-

తెలుగు సినిమా పరిశ్రమలో చాలా రోజులు నంబర్ వన్ గా వెలుగొందిన మెగాస్టార్ చిరంజీవి,తెలుగు సినిమా పై తనదైన ముద్ర వేశారు. తాను వచ్చిన తర్వాత మాత్రమే తెలుగు సినిమాలలో పైట్లకు పాటలకు, మంచి గుర్తింపు వచ్చింది. అలాగే రెమ్యునరేషన్ పరంగా ఇండియాలోనే అమితాబ్ బచ్చన్ కంటే ఎక్కువ తీసుకొని  బిగ్గర్ దెన్ బచ్చెన్ గా ఇండియాటుడే లో ప్రముఖుడుగా పేరు పొందారు. అలాగే దాసరి నారాయణరావు తర్వాత పరిశ్రమను నడిపించే పెద్ద దిక్కుగా వున్నారు.

రాజకీయాలలో వెళ్ళక ముందు వరకు తన సినీ జీవితం సూపర్ గా సాగింది. ఎప్పుడైతే రాజకీయ ప్రవేశం చేశాడో అప్పటినుండి తన చరిష్మా కోల్పోవడం జరిగింది. ఇక ఈ విషయాన్ని తొందరగానే గ్రహించి మళ్లీ సినిమా రంగంలో అడుగుపెట్టారు. ఇక తన రీసెంట్ సినిమా వాల్తేరు వీరయ్య 200 కోట్లు పైగా వసూళ్ళు సాధించి బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. ప్రస్తుతం చిరంజీవి మెహెర్ రమేష్ దర్శకత్వం లో భోళా శంకర్ సినిమా చేస్తున్నాడు. ఇంకా చాలా మంది దర్శకులను లైన్ లో పెట్టారు.

ఇప్పుడు పాత హిట్ సినిమాల రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇక మెగాస్టార్ ఆల్ టైమ్ హిట్ గ్యాంగ్ లీడర్ సినిమా ను కూడా 11 తేది రీ రిలీజ్ చేయాల నుకున్నారు. కాని వాయిదా పడినట్లు తెలుస్తోంది. దీనికిసాంకేతిక సమస్యలే వాయిదాకు కారణమని చెబుతున్నారు. అభిమానులు తమ అభిమాన నటుడిని ఫిబ్రవరి 11న గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలని ప్లాన్ చేశారు. ఈ వార్త విని మెగాస్టార్ చిరంజీవి అభిమానులు అందరూ చాలా నిరాశ కు గురి అయ్యారు.

 

Read more RELATED
Recommended to you

Latest news