మరో మలయాళ రీమేక్ లో మెగాస్టార్ చిరంజీవి

-

మెగాస్టార్‌ చిరు తాజాగా నటించిన మూవీ గాడ్ ఫాదర్. మోహన్ రాజా డైరెక్షన్ లో తెరకెక్కిన గాడ్ ఫాదర్ సినిమా ప్రస్తుతం బ్లాక్ బస్టర్ టాక్ తో థియేటర్లలో ప్రదర్శితం అవుతున్న సంగతి తెలిసిందే. దసరా పండుగ కానుకగా ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కావడంతో, ఫస్ట్ వీకెండ్ వరకు ఈ సినిమా అంచనాలకు మించి కలెక్షన్లను సాధించే ఛాన్స్ ఉంది. చిరంజీవి మరో మలయాళ రీమేక్ లో నటించబోతున్నారని చెబుతున్నారు.

అంతేకాకుండా ఈ సినిమాకి కూడా రామ్ చరణ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. ఆ మలయాళ సూపర్ హిట్ సినిమాకి సంబంధించిన రీమేక్ రైట్స్ కూడా రామ్ చరణ్ సొంతం చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.

అదే నిజమైతే మెగాస్టార్ మరో మలయాళ సూపర్ హిట్ సినిమాలో కనిపించనున్నారని చెప్పాల్సిందే. అది కూడా ఎంతో పవర్ఫుల్ క్యారెక్టర్ సూపర్ స్టోరీ సినిమాగా చెబుతున్నారు. ఆ సినిమా ఏదంటే, మలయాళం లో సూపర్ సక్సెస్ సాధించిన మమ్ముట్టి నటించిన భీష్మ పర్వం. ఇప్పుడు ఆ సినిమా రైట్స్ ని రామ్ చరణ్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అంటే ఆ సినిమాకి చిరంజీవి ఓకే చెబితే మెగాస్టార్ చిరంజీవిని ఒక మాస్ డాన్ క్యారెక్టర్ లో ప్రేక్షకులు చూడబోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news