ఎన్ని రకాలుగా చూసుకున్న ఏపీలో జనసేన బలం కొన్ని జిల్లాలకే పరిమితం అందులో ఎలాంటి డౌట్ లేదు. కేవలం ఐదు జిల్లాల్లోనే జనసేన ప్రభావం ఉందని ఇటీవల వచ్చిన పలు సర్వేల్లో తేలింది. విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలు. మళ్ళీ వీటిల్లో కాస్త ఎక్కువ ఓటు బ్యాంక్ ఉన్నది ఉభయ గోదావరి జిల్లాల్లోనే. అయితే ఈ ఐదు జిల్లాల్లో పట్టు ఉంది కదా…మరి ఈ జిల్లాల్లో జనసేన సత్తా చాటుతుందా? అంటే ఆ పరిస్తితి ఏ మాత్రం కనిపించడం లేదు. ఐదు జిల్లాలు కలిపి 82 సీట్లు ఉన్నాయి..ఈ 82 సీట్లలో జనసేన సింగిల్ గా పోటీ చేస్తే గెలిచే సీట్లు ఉన్నాయంటే…గట్టి తిప్పికొడితే ఐదు సీట్లు కూడా గెలుచుకోలేదని తెలుస్తోంది.
అంటే పట్టున్న జిల్లాల్లో కూడా జనసేన ప్రభావం ఈ స్థాయిలో ఉంది. అంటే మిగతా స్థానాల్లో జనసేన ఓటు బ్యాంక్ 10 వేల నుంచి 20 వేల వరకే ఉందని తెలుస్తోంది. మరి ఆ ఓట్లతో గెలుపు సాధ్యమేనా? అంటే ఏ మాత్రం సాధ్యం కాదు. ఆ ఓట్లతో పక్క పార్టీలని ఓడించవచ్చు గాని..జనసేన గెలవడానికి అవ్వదు. గత ఎన్నికల్లో కూడా అదే జరిగింది. జనసేన చాలా స్థానాల్లో ఓట్లు చీల్చడం వల్ల టీడీపీకి భారీ డ్యామేజ్ జరిగింది.
అంటే జనసేన గెలవదు..టీడీపీని గెలవనివ్వదు అనేలా పరిస్తితి ఉంది. అయితే గత ఎన్నికల నుంచైనా జనసేన బలం పెంచుకునే ఉంటే..చాలా సీట్లలో గెలుపు దిశగా వచ్చేది. కానీ పవన్ ఆ దిశగా పనిచేసినట్లు లేరు. ఎప్పటిలాగానే పార్ట్ టైమ్ పాలిటిక్స్ చేయడం వల్ల మళ్ళీ జనసేన బలపడలేదు. అటు నాయకులు కూడా పూర్తి స్థాయిలో వర్క్ చేయకపోవడం వల్ల జనసేనకు పట్టున్న చోట కూడా..గెలవలేని పరిస్తితి ఉంది. మరి ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది..ఇకనుంచైనా జనసేన బలం పెరుగుతుందేమో చూడాలి.