న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన మీరాబాయి చాను కీలక నిర్ణయం తీసుకున్నారు. తన శిక్షణ సమయంలో సహకరించిన ట్రక్ డ్రైవర్లుకు సాయం చేసేందుకు ఆమె రెడీ అయ్యారు. ట్రక్ డ్రైవర్లు తనను కలవాలని, చేతనైన సాయం చేస్తానని ఆమె ప్రకటించారు. తాను శిక్షణ కేంద్రానికి వెళ్లే సమయంలో ఉచితం లిఫ్ట్ ఇచ్చిన వారిని కలవాలని పిలుపు నిచ్చారు. వారి ఆశీర్వాదాలు కావాలని ఆమె కోరారు. తను కష్టకాలంలో ఉన్నప్పుడు వాళ్లు సహకరిచారని తెలిపారు. వారి కోసం తాను వెతుకుతున్నట్లు మీరాబాయి చెప్పారు.
చాను సోదరుడు, సాయిఖోమ్ సనతోంబా మీటీ, ఒలింపిక్స్.కామ్‌తో మాట్లాడుతూ, “మా తల్లిదండ్రులు మీరాబాయి చాను ప్రయాణానికి రూ.10-20 ఇచ్చేవాళ్లు. గ్రామం చాలా చిన్నది కావడం వల్ల మేము ప్రతిఒక్కరికీ తెలుసు. ఉదయాన్నే ట్రక్కులు మార్కెట్ కూడలి నుంచి బయలుదేరేవి. మీరాబాయిని ఆ ట్రక్కుల్లో శిక్షణ కేంద్రానికి పంపేవాళ్లం. అయితే వాళ్లు ఎప్పుడూ కూడా మీరాబాయితో అసభ్యంగా ప్రవర్తించలేదు. ప్రతిరోజూ వాళ్లతో ఒంటరిగానే వెళ్లేది.’’ అని తెలిపారు.