అత్యుత్త‌మ ఫుట్ బాల‌ర్ గా మ‌రో సారి మెస్సీ

-

ప్ర‌ముఖ ఫుట్ బాల్ ఆట‌గాడు లియోనెల్ మెస్సీ ప్ర‌పంచ రికార్డు ను సృష్టించాడు. ఎక్కువ సార్లు బాల‌న్ డి ఓర్ అనే అవార్డు ను గెలుచు కున్న ఫుట్ బాల‌ర్ గా రికార్డు సృష్టించాడు. 2021 ని సంబంధించిన బాల‌న్ డి ఓర్ అవార్డు అర్జెంటినా ఫుట్ బాల్ ఆట‌గాడు లియోనాల్ మెస్సీ సొంతం చేసుకున్నాడు. దీని తో మొత్తం 7 సార్లు బాల‌న్ డి ఓర్ అవార్డు ను కైవ‌సం చేసుకున్నాడు. ప్ర‌తి ఏటా ఫుట్ బాల్ ఆట లో అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న చేసిన వారికి బాల‌న్ డి ఓర్ అనే అవార్డు ను ఇస్తారు.

అయితే లియోనాల్ మెస్సీ గ‌తంలో 2009, 2010, 2011, 2012, 2015, 2019 ల లో బాల‌న్ డి ఓర్ అనే అవార్డు ను కైవ‌సం చేసుకున్నారు. కాగ క‌రోనా వైర‌స్ వ‌ల్ల 2020 లో ఈ అవార్డు ఇవ్వ‌లేదు. కాగ లియోనాల్ మెస్సీ గ‌త సీజ‌న్ లో 48 మ్యాచ్ ల‌లో 38 గోల్స్ కోట్టాడు. అంతే కాకుండా కోపా అమెరికా క‌ప్ ను కూడా గెలిచాడు. అయితే ఈ ఏడాది కూడా బాల‌న్ డి ఓర్ అవార్డు ను మెస్సీ గెలుచు కోవ‌డం తో త‌న అభిమానులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news