MI-17 V5 హెలికాప్టర్ ప్రత్యేకతలివే…

-

ఛీప్ ఆఫ్ ఢిపెన్స్ స్టాప్ ( సీడీఎస్) బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న MI-17 V5 హెలికాప్టర్ కుప్పకూలిన విషయం తెలిసిందే. అయితే  ఇప్పుడు ఈ రకం హెలికాప్టర్ ప్రత్యేకతలపై అందరి ద్రుష్టి పడింది. MI-17 V5 హెలికాప్టర్ ను రష్యా తయారు చేసింది. దీనిని ప్రపంచంలో అత్యాధునిక రవాణా హెలికాప్టర్ గా పేరు ఉంది. ఇందులో మొత్తం ముగ్గురు సిబ్బందితో పాటు 39 మంది ప్రయాణించవచ్చు. MI-17 V5లో FLIR సిస్టమ్ తో పాలు ఎమర్జెన్సీ ఫ్లోటేషన్ సిస్టమ్స్ ఉన్నాయి. ఒకేసారి 4500 కిలోల బరువులను మోసుకెళ్లగలదు. ఎస్-8 రాకేట్లు, 23 ఎంఎం మెషిన్ గన్ వంటి ఆయుధ వ్యవస్థలు ఉన్నాయి.

సైనిక బలగాల రవాణ, రక్షణ వంటి ఆపరేషన్లలో MI-17 V5 హెలికాప్టర్లను వినియోగిస్తారు. అగ్ని ప్రమాదాల సమయంలో, గాలింపు రక్షణ విధుల్లో వినియోగిస్తున్నారు. MI-17 V5 హెలికాప్టర్ల కోసం 2013లో రక్షణ శాఖ తొలి ఆర్డర్ చేసింది. తొలుత మొత్తం 12 హెలికాప్టర్ల కోసం ఆర్డర్ ఇచ్చింది. దీనికి ముందు మొత్తం 80 హెలికాప్టర్ల కోసం 2008లోనే రెండు దేశాల మధ్య ఒప్పందం జరిగింది. 1.3 బిలియన్లతో రక్షణ శాఖ ఒప్పందం చేసుకుంది. 2011 నుంచి ఈ హెలికాప్టర్లను డెలవరీ చేయడం ప్రారంభించింది రష్యా. 2013 ప్రారంభం వరకు మొత్తం 36 హెలికాప్టర్లు డెలవరీ చేసింది. 2018 వరకు ఆఖరి బ్యాచ్ MI-17 V5 భారత దేశానికి వచ్చాయి.

Read more RELATED
Recommended to you

Latest news