పాడి పశువులకు ఈ పద్దతులలో మాత్రమే పాలను తియ్యాలి..

-

మన దేశంలో పశు సంపద కూడా ఎక్కువగానే ఉంటుంది..అధిక శాతం పాలను ఇచ్చే పశువుల నుంచి పాలను కొన్ని పద్ధతుల ద్వారా పితకాలని నిపుణులు అంటున్నారు. అవేంటో ఒకసారి చుద్దాము..మన దేశంలో ఎక్కువ మంది రైతులు చేతుల ద్వారానే పాలు పిండుతుంటారు. దీనికి ప్రధాన కారణం రైతుల వద్ద పాడి పశువులు తక్కువ సంఖ్యలో ఉండటం మరియు తక్కువ పాలనిచ్చు దేశవాళి లేదా సంకరజాతి పశువులుండటంతో ఈ పద్ధతిని ఎక్కువగా అవలంభిస్తుంటారు. చేతి ద్వారా పాలు పిండు విధానములు ఈ క్రింది విధంగా ఉంటాయి.

  • ఫుల్ హ్యాండ్ పద్ధతి
  • స్టెప్పింగ్ పద్దతి
  • సకలింగ్ పద్ధతి

ఫుల్ హ్యాండ్ పద్ధతి :- ఈ పద్ధతిలో రెండు చేతుల యొక్క వేళ్లతో చనులను పట్టుకొని పాలను పిండుతారు. ఈ పద్ధతిని ఎక్కువగా గేదెల్లోను మరియు పొడవైన చనులు కలిగి యున్న పాడి పశువులకు ఉపయోగిస్తుంటారు.
లాభాలు: ఈ పద్ధతి ద్వారా పాడి పశువు యొక్క పొదుగుకు సక్కిలింగ్ రిఫ్లెక్స్ (సేపు) త్వరగా వస్తుంది. ఫలితంగా పాలను త్వరగా పిండవచ్చు.
నష్టాలు:ఈ పద్ధతి ద్వారా పాలను ఎక్కువ సేపు పిండలేము. ఫలితంగా పాలను ఆగి, ఆగి పిండవలసి ఉంటుంది మరియు పొదుగు నుండి పూర్తి పాలను పిండుటకు వీలు కాదు. చివరిలో స్ట్రిపింగ్స్ చేయాలి.

స్ట్రిప్పింగ్ పద్ధతి ద్వారా పాలను పిండుట: ఈ పద్దతిలో చనులను బ్రొటన వ్రేలు మరియు చూపుడు వ్రేలుతో కొద్ది కొద్దిగా వత్తుతూ క్రిందకు పిండుతారు. చిన్న సైజు పశువులలో మరియు చిన్న సైజు చనులు కలిగిన పాడి పశువులలో ఈ పద్ధతి ఉపయోగకరంగా ఉంటుంది.
లాభాలు:ఈ పద్ధతిలో పాలు పిండేటప్పుడు సమయం వృధా కాకుండా ఉంటుంది మరియు పాలను సులభంగా పిండవచ్చు.
నష్టాలు:ఈ పద్ధతి ద్వారా పాలు పిండునప్పుడు పశువులకు నొప్పిగా ఉంటుంది, ఫలితంగా పాడి పశువులు పూర్తి సామర్ధ్యం మేర పాలను ఇవ్వలేవు మరియు నొప్పి మూలంగా పశువులు అటు ఇటు కదులుతూ ఉంటాయి.

సకలింగ్ పద్ధతి ద్వారా పాలను పిండుట: ఈ పద్ధతిలో ఆవు యొక్క చనును, ఒక వైపు చిన బొటన వ్రేలుతో పట్టుకొని, మరొక వైపు మిగిలిన నాలుగు వ్రేళ్ళతో పట్టుకొని పాలు పిండుతారు. ఈ పద్ధతిని ఎక్కువగా పెద్ద సైజు గేదెలలోనూ మరియు పెద్ద చనువులు కలిగిన పాడి పశువులలోను ఉపయోగిస్తారు.
లాభాలు:ఈ పద్ధతి ద్వారా పాలను తొందరగా పిండవచ్చు. ఒక సారి పాలు పిండడం ప్రారంభించిన తరువాత పాలు పిండడం పూర్తి అయ్యే వరకు చేయి వదలకుండా పాలను పూర్తిగా పిండడము చేయవలసి ఉంటుంది. పొదుగుకు గాయాలు అయ్యే అవకాశాలు చాలా తక్కువ.

నష్టాలు:ఈ పద్ధతి ద్వారా పాలు పిండునప్పుడు పశువులు ఒత్తిడికి గురి అవుతుంది.

అధికంగా పాలు పితికే పశువుల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి..

Read more RELATED
Recommended to you

Latest news