మునుగోడు మినీ వార్… కారు ఎత్తులకు కమలం చెక్?

-

మునుగోడు ఉపఎన్నికలో పైచేయి సాధించడానికి ఎవరికి వారు అదిరిపోయే వ్యూహాలతో రాజకీయం చేస్తున్నారు. ఎలాగైనా సెమీ ఫైనల్ లాంటి మునుగోడు ఉపఎన్నికలో గెలిచి..అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని అటు అధికార టీఆర్ఎస్, ఇటు ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు ప్రయత్నిస్తున్నాయి. ఈ మునుగోడుని దక్కించుకునేందుకు టీఆర్ఎస్ పార్టీ తెగ కష్టపడుతుంది. ఇప్పటికే బీజేపీ చేతిలో రెండుసార్లు ఓడిపోయింది…ఇప్పుడు మునుగోడులో కూడా ఓడిపోతే…నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడం అనేది చాలా కష్టమైపోతుంది.

అందుకే ఎలాగైనా మునుగోడుని దక్కించుకోవడానికి టీఆర్ఎస్…అధికార బలాన్ని అంతా ఉపయోగిస్తుంది. అయితే టీఆర్ఎస్ పార్టీ అధికార బలనికి ఎప్పటికప్పుడు చెక్ పెట్టేలా బీజేపీ దూకుడుగా రాజకీయం చేస్తుంది. వాస్తవానికి మునుగోడులో బీజేపీకి బలం తక్కువ. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాకతో బీజేపీ బలం మరింత పెరిగింది. ఇక క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలని లాగితే బీజేపీ బలం మరింత పెరుగుతుంది. ఇప్పుడు అదే దిశగా బీజేపీ పనిచేస్తుంది.

అయితే ఈ మధ్య టీఆర్ఎస్ టికెట్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి ఇవ్వొద్దని, కొందరు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అలా పార్టీకి వ్యతిరేకంగా నడిచే వాళ్ళని దారికి తెచ్చుకోవడానికి టీఆర్ఎస్ పోలీసులని సైతం ప్రయోగిస్తుంది. ఈ క్రమంలోనే చౌటుప్పల్‌ ఎంపీపీ తాడూరి వెంకట్‌రెడ్డిని దారికి తెచ్చుకునేందుకు ఆయనపై ఉన్న పాత కేసులను తెరపైకి తెచ్చింది. ఆ కేసుల్లో వెంకట్‌రెడ్డిని అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఇదే సమయంలో ఈటల రాజేందర్…ఆయనకు వల వేసి…మరుసటిరోజే జేపీలో చేరేలా చేశారు. ఇలా టీఆర్ఎస్ ఎత్తులకు బీజేపీ పై ఎత్తు వేసి చిత్తు చేస్తుంది.

అటు కాంగ్రెస్ శ్రేణులని సైతం బీజేపీ లాగడానికి చూస్తుంది. మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి బలం ఎక్కువే…అందుకే ఆ పార్టీపై ఎక్కువ ఫోకస్ పెడుతుంది..కాంగ్రెస్ శ్రేణులని సగం లాగితే చాలు ఆటోమేటిక్ గా బీజేపీ గెలుపు ఖాయమవుతుంది. మొత్తం మీద మునుగోడులో కమలం దూకుడు మీద ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news