ముంబైలో దారుణం.. బాంబులు కాల్చవద్దన్నందుకు కత్తితో పొడిచి హత్య

-

క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు జీవితాలను అంధకారంలోకి నెట్టుతాయి. అలాంటి ఘటనే ఇది. గ్లాసు బాటిల్‌లో బాంబులు కాల్చడం వల్ల వాటి ముక్కలు అందరికీ గుచ్చుకునే ప్రమాదం ఉందని, కాబట్టి వాటిని కాల్చొద్దన్న యువకుడి వారించాడు. దీంతో.. కోపంతో ముగ్గురు మైనర్‌ బాలలు సదరు యువకుడినికత్తితో పొడిచి చంపారు. ఈ ఘటన ముంబైలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని శివాజీ నగర్‌కు చెందిన 12 ఏళ్ల బాలుడు గ్లాసు బాటిల్‌లో టపాసులు ఉంచి పేలుస్తున్నాడు. గమనించిన పొరిగింటి యువకుడు సునీల్ శంకర్ నాయుడు (21) వద్దని వారించాడు. అది చాలా ప్రమాదమని, గ్లాసు పేలి దాని ముక్కలు అందరికీ గుచ్చుకుంటాయని, కాబట్టి వద్దని వారించాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.

US woman buys second-hand freezer, finds dead body inside | World News -  Hindustan Times

గొడవను చూసిన బాలుడు అన్న (15), అతడి స్నేహితుడు (14) అక్కడికొచ్చారు. ముగ్గురూ కలిసి శంకర్‌తో గొడవకు దిగారు. అనంతరం ఆగ్రహంతో అతడిపై దాడిచేశారు. బాలుడి అన్న కత్తితో శంకర్ పొట్టలో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన శంకర్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు ప్రాణాలు విడిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాలుడి అన్న, అతడి స్నేహితుడిని అరెస్ట్ చేశారు. ఘటనకు కారణమైన బాలుడు పరారీలో ఉన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news