Breaking : కడప ప్రజల చిరకాల వాంఛను తీర్చనున్నాం : మంత్రి అమర్నాథ్‌

-

రాష్ట్రానికి వస్తున్న పారిశ్రామిక పెట్టుబడులు.. ప్రగతి గురించి చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు మంత్రి గుడివాడ అమర్నాధ్. ఏపీ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తీసేలా టీడీపీ.. చంద్రబాబు వ్యవహరిస్తున్నారని మంత్రి గుడివాడ అమర్నాధ్ మండిపడ్డారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన హయాంలో రూ. 5 లక్షల కోట్లు పెట్టుబడులు, 5 లక్షల ఉద్యోగాలు తెచ్చామని చంద్రబాబు కల్లబొల్లి మాటలు చెబుతున్నారన్నారు. గత ప్రభుత్వం కుదుర్చుకున్న ఎంఓయూల్లో కేవలం రూ. 34 వేల కోట్లు మాత్రమే పెట్టుబడులు వచ్చాయన్నారు. అంతేకాకుండా.. ‘ రూ. 16 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకుంటే కేవలం 2 శాతం మాత్రమే గ్రౌండ్ అయ్యాయి. జిందాల్ స్టీల్ సంస్థ కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరగనుంది. మొదటి విడతకు త్వరలోనే భూమి పూజ చేపట్టనున్నాం. కడప ప్రజల చిరకాల వాంఛను తీర్చనున్నాం. గతంలో వైఎస్ హయాంలో కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టాలనుకుంటే నాటి ప్రతిపక్షాలు అడ్డుపడ్డాయి. ఇప్పుడు మళ్లీ అదే తరహా ప్రయత్నాలు చేస్తున్నాయి.

 

YSRCP MLA Gudivada Amarnath slams at GITAM, says they are in thirst of  govt. lands

ఏపీలోని పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు విషయంలో దేశానికి దిక్సూచిగా ఉంది. ఎక్కడెక్కడ ప్రాజెక్టులు పెట్టే అవకాశం ఉందో పబ్లిక్ డొమైనులోనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ పీఎస్పీల ద్వారా ఆదాయం వస్తోంది. 13500 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తికి ప్రస్తుతం ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. ఇంకా 20 వేల మెగా వాట్లను పీఎస్పీల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. మరిన్ని ప్రాజెక్టులు పెట్టడానికి ఎవరైనా ముందుకొస్తే మేం ఆహ్వానిస్తాం. అమర్ రాజా వెళ్లిపోయిందన్నారు.. ఇప్పుడు అదే అమర్ రాజా రూ. 250 కోట్లు పెట్టుబడులు పెడుతోంది. అనకాపల్లి నియోజకవర్గం పరిధిలోని ఓ గ్రామంలో హెరిటేజ్ కంపెనీ పన్నులు కట్టలేదు.. మేమన్నా ఇబ్బంది పెట్టామా..? ప్రాసెస్ ప్రకారం నోటీసులిచ్చారు.. రూ. 60 లక్షలు కట్టారు. పరిశ్రమల వల్ల ఒక్క ప్రాణం పోయినా ప్రభుత్వం చూస్తూ ఊరుకోలేదు. టీడీపీ తరహాలో అబద్దాలు చెప్పం.. చెప్పలేం. తమను 23 స్థానాలకే పరిమితం చేశారని ప్రజలపై…రాష్ట్రంపై చంద్రబాబుకు కోపం ఉంటే ఎలా..? ప్రత్యేక హోదా లేదని కేంద్రం ఇప్పుడు చెప్పడమేంటీ..? చంద్రబాబు హోదా వద్దన్నప్పుడే చెప్పేసింది. ప్రత్యేక హోదా రాకున్నా.. చంద్రబాబుకు ప్యాకేజీ అందింది కదా..? వారాహి వాహనానికి మేమేం అభ్యంతరం పెట్టడం లేదు. ఏపీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎలా ఉంటుందో మేం పరిశీలిస్తాం. వారాహి ఏపీలోకి వచ్చాక పసుపు రంగేసుకుంటోందో..? బీజేపీ రంగేసుకుంటుందో చూడాలి. అందుకే వారాహి వాహానంపై ఏ ఫొటోలు పెట్టలేదు. ఏపీలోకి వచ్చాక.. ఎవరు ఎక్కువ ప్యాకేజీ ఇస్తే వారి రంగేస్తారేమో చూడాలి. విశాఖలో కాపునాడు సమావేశం ఉందేమో నాకు తెలీదు.’ అని మంత్రి గుడివాడ అమర్నాధ్ వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news