ఆ నాటి మహనీయుల పోరాటం స్ఫూర్తిని తెలియజెప్పేందుకే వజ్రోత్సవాలు : మంత్రి ఎర్రబెల్లి

-

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వతంత్ర భారత వజ్రోత్సవాల పేరిట 15 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఆ నాటి మహనీయుల పోరాటం, తాగ్యాల ఫలితమే మనం అనుభవిస్తున్న స్వాతంత్య్రమని.. ఆ స్ఫూర్తిని నేటి తరాలకు తెలియజెప్పేందుకే ప్రభుత్వం వజ్రోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వేడుకల్లో భాగంగా శనివారం జనగామ జిల్లా కొడకండ్ల మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలను ప్రారంభించారు మంత్రి ఎర్రబెల్లి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ సీఎం కెసీఆర్ ఆధ్వర్యంలో దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో వజ్రోత్సవ వేడుకలు జరుగుతున్నాయన్నారు మంత్రి ఎర్రబెల్లి. ప్రతి ఇంటిపై జెండా ఎగురవేయడం, మహనీయుల త్యాగాలను స్మరించుకునేలా 15 రోజులపాటు రోజుకో కార్యక్రమాన్ని నిర్వహించి స్వతంత్ర స్ఫూర్తి, దేశభక్తి, సమైక్యతా భావాన్ని ప్రతి ఒక్కరిలో కలిగేలా ఉత్సవాలను పట్టణాలు, పల్లెపల్లెగా ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

అహింసా మార్గంలో ఆనాడు గాంధీజీ, నెహ్రూ, సర్దార్ వల్లభభాయి పటేల్ సాధించిన భారత స్వతంత్రాన్ని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారుమంత్రి ఎర్రబెల్లి. సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోనే తెలంగాణ అన్ని రంగాల్లో ముందు ముందుందన్నారు. ప్రతి ఇంటా జెండా ఎగరవేయడంతోపాటు స్వతంత్ర పోరాటంలోని మహనీయుల త్యాగాలను స్మరించుకునే విధంగా పదిహేను రోజుల పాటు రోజుకో కార్యక్రమాన్ని నిర్వహించి స్వాతంత్య్ర స్ఫూర్తిని, దేశభక్తి, సమైక్యతా భావం, ప్రతి ఒక్కరిలో కలిగేలా ఈ ఉత్సవాలను నగరంతో పాటు ప్రతి మండలం, గ్రామ గ్రామాన ఘనంగా నిర్వహిస్తున్నారని చెప్పారు. అహింసా మార్గంలో ఆనాడు గాంధీజీ, నెహ్రూ, సర్ధార్ వల్లభాయి పటేల్ సాధించిన భారత స్వతంత్రాన్ని స్ఫూర్తిగా తీసుకొని అహింసా మార్గంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. అనంతరం పోటీల్లో గెలుపొందిన వారికి మంత్రి బహుమతులు ప్రదానం చేశారు మంత్రి ఎర్రబెల్లి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version