మేనమామగా సీఎం కేసీఆర్ ను ఆదరించాలి – మంత్రి ఎర్రబెల్లి

-

మేనమామగా సీఎం కేసీఆర్ ను ఆదరించాలని మంత్రి ఎర్రబెల్లి కోరారు. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడారు. ఇంకో సంవత్సరంలో హైదరాబాద్ కు పోటీగా హనుమకొండ ఉండబోతుందని.. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అనేక రకాలుగా అభివృద్ధి చెందిందని వివరించారు. మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఘనత కేసీఆర్,కేటీఆర్ లకే దక్కుతుందన్నారు.

ఆడపిల్ల పెళ్ళికి మేనమామ గా లక్ష రూపాయలు ఇచ్చిన ఘనత కేసీఆర్ దేనని.. మేనమామ గా సీఎం కేసీఆర్ ను ఆదరించాలని కోరారు. కర్ణాటకలో పెన్షన్ 500 వస్తుంది….అదికూడా కరోనాతో రావాట్లేదు.. తెలంగాణలోనే ప్రతికుటుంబానికీ 2000 పెన్షన్ కేసీఆర్ ఇస్తున్నారని వివరించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. నిన్న ఢీల్లీలో కేంద్రమంత్రులు తెలంగాణ పథకాలను పోగిడారు.. సిగ్గు లేకుండా బీజేపీ నాయకులు ధర్నా చేస్తున్నారని ఆగ్రహించారు. ఉద్యోగాలు ఇయ్యానీవారు కూడా ధర్నాలు చేస్తున్నారు.. కేంద్రప్రభుత్వం ఒక్క ఉద్యోగం ఇచ్చినట్టైతే నేను దేనీకైనా సిధ్ధమంటూ సవాల్ విసిరారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.

Read more RELATED
Recommended to you

Exit mobile version