Harish Rao : అమిత్ షా.. అస‌త్యాల షాగా మారిపోయాడు

-

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నిన్న తుక్కుగూడ భారీ బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. అమిత్ షా నిన్న‌ తెలంగాణకు వ‌చ్చి మాట్లాడిన మాట‌లు వింటే ఆయ‌న నిజంగానే అమిత్ షా కాదు అబ‌ద్దాల షా అని రుజువు చేసుకున్నార‌ని మండిపడ్డారు. న‌డ్డానేమో అబ‌ద్ధాల‌కు అడ్డ‌గా, అమిత్ షానేమో అబ‌ద్ధాల‌కు బాద్ షాగా నిరూపించుకున్నాడ‌ని తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు హరీష్‌రావు. అమిత్ షాకు అల్జీమ‌ర్స్ వ్యాధి ఏమైనా ఉందా? అని ప్ర‌శ్నించారు హరీష్‌రావు. మెద‌క్ జిల్లా తుప్రాన్‌లో ఎంపీ కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డితో క‌లిసి మంత్రి హరీష్‌రావు మీడియాతో మాట్లాడారు.

TRS look towards the trouble shooter Harish Rao in Huzurabad

బీజేపీ అంటేనే భార‌తీయ ఝూటా పార్టీ అని నిప్పులు చెరిగిన హరీష్‌రావు.. అబ‌ద్ధాల‌ను ప్రచారం చేయండి అని అమిత్ షానే స్వ‌యంగా గ‌తంలో చెప్పార‌న్నారు. అబ‌ద్ధాలు ప‌బ్లిక్‌గా చెప్పే పార్టీ ఏదైనా ఉందా అంటే అది బీజేపీనే అని హరీష్‌రావు పేర్కొన్నారు. అమిత్ షా మాట్లాడిన దాంట్లో ఒక్క‌టి కూడా నిజం లేదు. అమిత్ షా కాస్త అస‌త్యాల షాగా మారిపోయాడని ఎద్దేవా చేశారు. అల‌వోక‌గా అబ‌ద్ధాలు ఆడిండు. ఈ దేశంలో ఒక రాజ‌కీయ నాయ‌కుడు ఇంత అల‌వోక‌గా అబ‌ద్ధాలు మాట్లాడే నాయ‌కుడు ఎవ‌రైనా ఉన్నారంటే అది అమిత్ షానే అని హరీష్‌రావు విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news