తెలంగాణలో త్వరలోనే టీచర్ల రిక్రూట్‌మెంట్‌ : మంత్రి హరీశ్‌రావు

-

తెలంగాణలో విద్యారంగాన్ని పట్టించుకోవడం లేదని కొందరు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్ పై ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా ఉన్నారని.. త్వరలోనే ఖాళీలు భర్తీ చేస్తామని తెలిపారు. ఉద్యోగుల విషయంలో తెలంగాణ రాష్ట్రానిది ఫ్రెండ్లీ ప్రభుత్వమని హరీశ్ రావు అన్నారు. టీచర్లకు ఎలాంటి సమస్యలున్నా ప్రభుత్వం వీలైనంత త్వరగా స్పందించి పరిష్కారం చూపిందని చెప్పారు. త్వరలో ఉద్యోగుల ఆరోగ్య కార్డుల విషయంలోనూ నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారు.

సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మహంతి ఆడిటోరియంలో పీఆర్‌టీయూఎస్‌ రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశం జరిగింది. ఎమ్మెల్సీ కూర రఘోత్తమరరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి హరీశ్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉపాధ్యాయులను కలవడం సంతోషంగా ఉందని హరీశ్ రావు అన్నారు.

సమాజాన్ని దారిలో నడిపించేది మేధావులేనని హరీశ్ రావు అన్నారు. అబద్ధాలను వ్యాప్తి చేసే మేధావుల సంఖ్య నేటి సమాజంలో పెరిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే నిజాలు మన కళ్లముందే కనిపిస్తాయని చెప్పారు.  మంచి చెడును విశ్లేషించగలిగే ఉపాధ్యాయులు రాష్ట్రంలో జరుగతుున్న అభివృద్ధిని ప్రజలకు తెలియజేయాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news