భర్తతో దిగిన ఫొటోలు, వీడియో షేర్ చేసిన నిహారిక..సోషల్ మీడియాలో వైరల్!?

-

మెగా బ్రదర్ నాగబాబు తనయ నిహారిక..చైతన్యతో మ్యారేజ్ తర్వాత సినీ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ గా కొనసాగుతోంది. పలు వెబ్ సిరీస్ లను ఆమె ప్రొడ్యూస్ చేస్తోంది. సోషల్ మీడియాలో నిహారిక చాలా యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి అందరికీ విదితమే. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఆమెను కొన్ని సార్లు ట్రోలింగ్ కూడా ఎదుర్కొంది.

 

తాజాగా ఇన్ స్టా గ్రామ్ వేదికగా నిహారిక షేర్ చేసిన ఫొటోలు, వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. భర్త చైతన్య ఒడిలో పడుకుని ముద్దుల వర్షం కురిపిస్తూ దిగిన ఫొటోలు షేర్ చేయగా, అవి బాగా వైరలవుతున్నాయి. భర్త ఒడిలో పడుకుని ముద్దులు ఇస్తూ ఆ ముద్దులు తన భర్త కు కాదని, తన అక్క సుష్మితకు అని చెప్తోంది. ఈ వీడియోను సుష్మిత రికార్డు చేసింది.

ఇలా చేయడం ద్వారా తన అక్క సుష్మిత అంటే తనకు ఎంత ఇష్టమో చెప్పాలని నిహారిక ప్రయత్నించినదని అర్థమవుతోంది. కానీ, వ్యక్తిగత జీవితంలో ముఖ్యంగా బెడ్ రూమ్ లో దిగిన పర్సనల్ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియా ద్వారా బహిర్గతం చేయడమేంటని కొందరు నెటిజన్లు అంటున్నారు. ఈ వీడియో, ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి.

సదరు వీడియోలో నిహారిక తన భర్త ఒడిలో పడుకుని అలా కెమెరా వైపునకు చూస్తూ ముద్దులు ఇస్తూ ఫోన్ చూస్తోంది. చైతన్య మాత్రం ఫోన్ లో ఫుల్ బిజీగా ఉండిపోయాడు. అలా స్మార్ట్ ఫోన్ ను చూస్తూ ఉండిపోగా, నిహారిక కెమెరాను చూస్తూ చైతన్య ఒడిలో పడుకుని కాలు పైకి లేపుతూ కనబడుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news