గద్దర్ మరణం పట్ల మంత్రి కేటీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశంల్లో మాట్లాడిన ఆయన గద్దర్ గురించి ప్రస్తావించారు. గద్దర్.. తన గళంతో కోట్లాది మంది ప్రజలను ఉత్తేజపరిచారని, ఆయన మరణం బాధాకరమని అన్నారు. కవిగా, గాయకుడిగా తన ఆట, పాటలతో లక్షలాది మంది అభిమానాన్ని సంపాదించుకున్నారని, ప్రజలను చైతన్య పరిచారని అన్నారు. ఈ సందర్భంగా గద్దర్ కుటుంబ సభ్యులకు కేటీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రజా ఉద్యమాలను తీర్చిదిద్దన మహాకళాకారుడని, ఆయన లేని లోటు తీర్చలేనిది.
పూడ్చలేనిదన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన వేదికను పంచుకున్నామని గుర్తు చేసుకున్నారు. ఎన్నో సందర్భాల్లో ఉత్సాహాన్ని నింపిన అద్భుతమైన కళాకారుడని, ఆయన లేకపోవడం బాధాకరమన్నారు. శాసనసభ, ప్రభుత్వం తరఫున సంతాపం ప్రకటించారు. ప్రజాకళలు వర్ధిల్లినంత కాలం, జానపదం ఉన్నంత కాలం ఆయన పేరు అజరామరంగా నిలిచి ఉంటుందన్నారు. ఆయన కుటుంబానికి కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నామన్న కేటీఆర్.. కుటుంబంతో పాటు ఆయన మిత్రులకు మనోధైర్యాన్ని, ఆత్మస్థయిర్యం ఇవ్వాలని, ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానన్నారు.