టీఎస్ ఐపాస్ పెట్టుబ‌డుల‌కు బాట‌లు వేసింది : మంత్రి కేటీఆర్‌

-

తైవాన్ భార‌త‌దేశ ప్ర‌తినిధి బౌష‌న్ గేర్ ఆధ్వ‌ర్యంలో తైవాన్ వ్యాపార ప్ర‌తినిధి బృందం తెలంగాణ ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి
కేటీఆర్‌తో శుక్ర‌వారం స‌మావేశ‌మైంది. అయితే.. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ తైవాన్ వ్యాపార ప్ర‌తినిధి బృందం మాట్లాడుతూ.. చిన్న‌, మ‌ధ్య త‌ర‌హా సంస్థ‌ల‌కు స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇస్తూ స‌హాయం చేయాల‌ని కోరారు. ఈ స‌మావేశంలో లైఫ్ సైన్సెస్, ఐసీటీ స‌హా శ‌క్తివంత‌మైన పారిశ్రామిక ప‌ర్యావ‌ర‌ణ వ్య‌వస్థ తెలంగాణ‌లో ఉంద‌ని తైవాన్ బృందానికి వివ‌రించారు మంత్రి కేటీఆర్. తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకొచ్చిన టీఎస్ ఐపాస్ పెట్టుబ‌డుల‌కు బాట‌లు వేసింద‌న్నారు మంత్రి కేటీఆర్.

Image

పెట్టుబ‌డుల‌కు అనువైన గ‌మ్య‌స్థానం హైద‌రాబాద్ అని స్ప‌ష్టం చేశారు. పెట్టుబ‌డుల‌కు ఉన్న అవ‌కాశాల‌ను స‌ద్వినియోగం చేసుకోవాల‌ని కోరారు మంత్రి కేటీఆర్. భారీ పెట్టుబ‌డుల‌తో వ‌స్తే పూర్తి స‌హాయ, స‌హ‌కారాలు అందిస్తామ‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు మంత్రి కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news