వైతాళికుల గొప్పదనాన్ని భవిష్యత్తు తరాలకు తెలియజేసేందుకే విగ్ర‌హాలు : మంత్రి కేటీఆర్

-

సిరిసిల్ల ప‌ట్ట‌ణంలో మానేరు న‌ది స‌మీపంలోని ఎల్ల‌మ్మ గుడి వ‌ద్ద కొత్త‌గా ఏర్పాటు చేసిన కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ విగ్ర‌హాన్ని మంత్రి కేటీఆర్ ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా బాపూజీకి ఘ‌న నివాళుల‌ర్పించారు. అనంత‌రం అక్క‌డ ఏర్పాటు చేసిన స‌భ‌లో కేటీఆర్ ప్ర‌సంగించారు… ఆచార్య‌ కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ స్వాతంత్ర్య ఉద్య‌మం స‌హా అనేక పోరాటాలు చేశార‌ని టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కొనియాడారు. బాపూజీ పోరాటాలు మ‌రువ‌లేనివి అని పేర్కొన్నారు మంత్రి కేటీఆర్. స్వాతంత్ర్యం రాక ముందే కాదు.. వ‌చ్చిన త‌ర్వాత కూడా తెలంగాణ ఉద్య‌మంలో బాపూజీ ముందంజ‌లో ఉన్నార‌ని గుర్తు చేశారు. ఉద్యమంలో తానూ పోరాటం చేయడమే కాదు పోరాట యోధులకు సహకారం అందించారని తెలిపారు మంత్రి కేటీఆర్. అప్పటి ప్రభుత్వం జ‌ల దృశ్యంలో తన ఇంటిని తీసి బయట‌ పడేశారో అక్కడే ప్రభుత్వం 20 అడుగుల ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింద‌న్నారు మంత్రి కేటీఆర్.

కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ పోరాటం మ‌రువ‌లేనిది : మంత్రి కేటీఆర్

తెలంగాణ వైతాళికుల గొప్పదనాన్ని భవిష్యత్తు తరాలకు తెలియజేసేందుకే విగ్ర‌హాలు ఏర్పాటు చేస్తున్నామ‌ని చెప్పారు మంత్రి కేటీఆర్. ఎవ్వరూ అడగకుండానే తెలంగాణలో కొత్త జిల్లాలకు, యూనివర్సిటీలకు, సంస్థలకు తెలంగాణ వైతాళికుల పేరు పెట్టామ‌ని స్ప‌ష్టం చేశారు మంత్రి కేటీఆర్. తెలంగాణ వైతాళికుల‌ను గౌర‌వించుకోవాల‌నే సంస్కారం ప్ర‌భుత్వానికి ఉంద‌న్నారు. సిరిసిల్లలో కొత్త చెరువు ట్యాంక్ బండ్, కొత్త జంక్షన్‌ల వద్ద రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపల్ ఖర్చులతో మహనీయుల విగ్రహాలు పెట్టుకుందామ‌ని చెప్పారు మంత్రి కేటీఆర్.

 

Read more RELATED
Recommended to you

Latest news