తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఇవాళ పశుసంవర్ధక శాఖపై అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సమీక్షలో పశువుల ఆసుపత్రులు, పశువులకు బీమా, ఫ్యామిలీ డాక్టర్ వంటి వైద్యసేవలు తదితర అంశాలపై అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్. స్వచ్ఛమైన పాల ఉత్పత్తికి చర్యలు తీసుకోవాలన్నారు సీఎం జగన్. పురుగుమందులు, రసాయనాలు ఎక్కువగా వాడటం వల్ల వివిధ రూపాల్లో జంతువుల దాణాలోకి ప్రవేశించి అక్కడి నుంచి పాలలో వాటి అవశేషాలు బయటపడుతున్నాయని సీఎం జగన్ చెప్పారు. అందువల్ల స్వచ్ఛమైన పాల ఉత్పత్తిపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు సీఎం జగన్.
దీనిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు అమూల్ సంస్థ ఆధ్వర్యంలో పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేసేలా చూడాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. పాలు, గుడ్లు తినడం వల్ల చిన్నారులు ఆరోగ్యంగా ఉంటారని, అయితే అదే పాలలో రసాయనాల అవశేషాల వల్ల చిన్నారుల ఆరోగ్యం దెబ్బతినే పరిస్థితులు వస్తున్నాయన్నారు. పశుసంవర్ధక శాఖలోని అసిస్టెంట్ పోస్టుల భర్తీని పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు సీఎం జగన్. అలాగే, పశుసంవర్ధక విధానాలపై రైతులకు నిరంతరం అవగాహన కల్పించాలని తెలిపారు సీఎం జగన్.