పండుగవేళ సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్‌ బోనస్‌ ప్రకటించారు : కేటీఆర్‌

-

మొండి చెయ్యి పార్టీని, చెవిలో పువ్వుపెట్టే పార్టీని నమ్మొద్దని మంత్రి కేటీఆర్‌ అన్నారు. 60 ఏండ్లు కరెంటు, నీళ్లవ్వక చావగొట్టిన కాంగ్రెస్ అలవిగాని హామీలతో ఆరు గ్యారంటీలు ఇస్తున్నదని విమర్శించారు. 150 ఏండ్ల క్రితం నాటి కాంగ్రెస్‌ గ్యారంటీ ఎప్పుడో తీరిపోయిందని ఎద్దేవాచేశారు. మంచిర్యాల జిల్లా పర్యటనలో భాగంగా మందమర్రి మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం మందమర్రి చౌరస్తాలో రోడ్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఓవైపు తెలంగాణకు మొండి చెయ్యి చూపే బీజేపీ, మరోవైపు చెవిలో పువ్వులు పెట్టే కాంగ్రెస్‌ పార్టీ అని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు డిపాజిట్లు కూడా రావన్నారు. దసరా దీపావళి పండుగవేళలో సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్‌ భారీగా బోనస్‌ ప్రకటించారని చెప్పారు. సింగరేణిని లాభాల బాటలో నడిపిస్తున్నారని, కార్మికులను కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నారని తెలిపారు.

Minister KTR : అప్పుడే.. దేశానికి పట్టిన దరిద్రం పోతుంది | Minister KTR  comments VK

రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పడుతుందని తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జోష్యం చెప్పారు. ఆదివారం మందమర్రి మండలం లో 300 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజలు, ప్రారంభోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రముఖ వ్యాపారి ఆదానికి పలు పరిశ్రమలను అప్పగించేందుకు కుట్రపునుతోందని అన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news