హైదరాబాద్ శంషాబాద్‌లోని నోవాటెల్‌లో దేశంలోనే తొలి అగ్రికల్చర్ డేటా ఎక్సేంజ్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. వ్యవసాయరంగంలో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా ఉన్నదని అన్నారు. దేశానికే అన్నం పెట్టేంతగా ధాన్యం పండిస్తున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు. రైతులకు బీమా కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం తమదన్నారు. వ్యవసాయ రంగానికి తెలంగాణ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యం ఇస్తున్నదని వెల్లడించారు మంత్రి కేటీఆర్.
సీఎం కేసీఆర్‌కు ఒక రైతు కాబట్టి వ్యవసాయంపై అవగాహన ఉందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరాన్ని అతి తక్కువ సమయంలో నిర్మించామని చెప్పారు. గతంలో పాలమూరు నుంచి వలసలు ఉండేవని, ఇప్పుడు వలసలు లేవని తెలిపారు మంత్రి కేటీఆర్. దేశంలో ఎక్కడా లేనివిధంగా మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు చేస్తున్నామని వెల్లడించారు. రైతులకు ఉచితంగా 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. దేశంలో నాణ్యమైన పత్తి తెలంగాణ నుంచి వస్తున్నదని చెప్పారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులు పునరుద్ధరించామనన్నారు మంత్రి కేటీఆర్.
ఇదిలా ఉంటే.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించి పార్లమెంట్‌లో బీజేపీ ఎంపీ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రధాని మోదీని అవమానించారన్న కారణంతో కాంగ్రెస్ ఎంపీపై చర్యలు తీసుకున్నారని.. మరి ఇప్పుడు సీఎం కేసీఆర్‌పై అత్యంత నీచమైన భాషలో మాట్లాడిన బీజేపీ ఎంపీని ఏం చేయాలో స్పీకర్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కేటీఆర్ శుక్రవారం ఉదయం ట్వీట్ చేశారు.