చట్టాలను కాపాడాల్సిన సీఎం స్వయంగా ఆయనే ఉల్లంఘిస్తున్నారు : పవన్‌

-

జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ విశాఖలోని రుషికొండను శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. కొండపైకి వెళ్లే దారిలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. రుషికొండ వద్దకు నడుచుకుంటూ వెళ్లడానికి జనసేనాని ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. రోడ్డు వద్ద నుండి చూడాలని సూచించారు. దీంతో అక్కడి నుండే పరిశీలించారు. కొండను తవ్వడంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Vizag police impose security curbs for Pawan Kalyan's Varahi Yatra visit

అనంతరం పవన్‌ కల్యాణ్‌ మీడియాతో మాట్లాడుతూ… చట్టాలను కాపాడాల్సిన ముఖ్యమంత్రి, ఆయనే ఉల్లంఘిస్తే ఎలా? అని ప్రశ్నించారు. విపక్షాలు, ఇతరులు ఎవరైనా శాంతియుతంగా చిన్న నిరసన తెలిపినా అరెస్టు చేస్తారని, కానీ జగన్ ప్రభుత్వం మాత్రం కొండను తవ్వినా ఏం కాదా? అన్నారు. తెలంగాణను ఇలాగే దోపిడీ చేస్తే తన్ని తరిమేశారని, ఇప్పుడు ఉత్తరాంధ్రపై కన్నుపడిందన్నారు. వరదలు, తుపానులు వచ్చినప్పుడు కొట్టుకుపోకుండా రుషికొండ కాపాడుతుందన్నారు. వీరు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను దోచేస్తున్నారన్నారు. ఇలాంటి వ్యక్తులను ఎన్నుకుంటే దోపిడి ఇలాగే ఉంటుందన్నారు.

 

ముఖ్యమంత్రి కార్యాలయానికి ఒక ఇల్లు సరిపోదా? ఇంకా ఎన్ని ఇళ్లు కావాలన్నారు. కిర్లంపూడి లేఔట్ తాకట్టు పెట్టి, ఇక్కడ అవసరమా? అన్నారు. రిషికొండలో నిర్మాణాలకు గ్రీన్ ట్రైబ్యునల్ అనుమతి ఉందా? చెప్పాలన్నారు.ముఖ్యమంత్రి అధికారిక కార్యాలయం కోసం ఇలా చేయాలా? ఓ మూలకు కూర్చోకుండా అద్భుతంగా కనిపించడం కోసం ఇక్కడ ముఖ్యమంత్రి కార్యాలయం కావాలా? అని ప్రశ్నించారు. కిర్లంపూడిలో క్యాంప్ కార్యాలయం పెట్టుకోవచ్చు కదా? అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news