మంత్రి కేటీఆర్ తో జగ్గారెడ్డి మంతనాలు !

-

సంగారెడ్డిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు పురపాలక ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. స్థానికంగా ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ కు రూ. 6 కోట్ల ఏడు లక్షల నిధులతో భూమి పూజ చేశారు మంత్రి కేటీఆర్. ఈ కార్యక్రమంలో లో స్థానిక ఎమ్మెల్యే జగ్గారెడ్డి పాల్గొన్నారు. తన నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి కోసం అధికారిక కార్యక్రమాలలో జగ్గారెడ్డి భూమి పూజలు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్బంగా… కలెక్టరేట్ లో కేటీఆర్, జగ్గారెడ్డి ల మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. మా ఎంపీలు, ఎమ్మెల్యేలను జాగ్రత్తగా చూసుకో జగ్గన్న అంటూ కేటీఆర్ పలకరించారు. మీరు మంత్రి … మీరే మమ్మల్ని చూసుకోవాలంటూ జగ్గారెడ్డి సరదాగా జవాబిచ్చారు. అనంత‌రం సంగారెడ్డి సదాశివపేట మున్సిపాలిటీల ఉన్న నిరుపేదలకు ఐదువేల మందికి ఇండ్ల స్థలాలు, డ్వాక్రా మహిళల భవనాలకు నిధులు, రంగారెడ్డి నియోజకవర్గానికి 996 కోట్ల నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేయాలని ఈ సంద‌ర్భంగా కేటీఆర్ ను కోరారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ప్ర‌స్తుతం వీరిద్ద‌రి క‌ల‌యిక‌… తెలంగాణ రాష్ట్ర రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news