నేతన్నల సంక్షేమంపైన బండి సంజయ్ కి మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ

-

నేతన్నల సంక్షేమం పైన బండి సంజయ్ కి మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు.చరిత్రలో ఎన్నడూ లేనంత భారీ గా టెక్స్టైల్ రంగానికి బడ్జెట్ కేటాయింపు చేస్తున్న ప్రభుత్వం మాదే అన్నారు.దేశంలో ఎక్కడా లేని విధంగా నేతన్నలకు యార్న్ సబ్సిడీ ఇస్తున్న చేనేత మిత్ర ప్రభుత్వం మాదేనన్నారు.ప్రత్యేక పొదుపు పథకం లో నేతన్నకు చేయూతనిస్తున్నది మా ప్రభుత్వం, మా ప్రభుత్వం వచ్చాక నేతన్నల ఆత్మహత్యలు ఆగిన విషయం బండి సంజయ్ కి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు.ముంబై, భీవండి, సూరత్ వంటి ప్రాంతాల నుంచి తెలంగాణకి కార్మికులు తిరిగి వస్తున్నది నిజం కాదా అన్నారు.

మా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రంలోని ఏ నేతన్నను అడిగిన చెబుతారని అన్నారు.నేతన్నలకు ఉన్న భీమాను ఎత్తేసిన కేంద్ర నిర్ణయంపై బండి సంజయ్ మాట్లాడాలని అన్నారు.కేంద్రం బీమా ఎత్తేస్తే…మేము నేతన్నకు ప్రత్యేక బీమా కల్పిస్తున్నామన్నారు.దేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్ పార్క్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ కి కేంద్రం నుంచి అందిన సాయం పై బండి సమాధానం ఇవ్వాలన్నారు.నేతన్నల పై బండి సంజయ్ కి నిజమైన ప్రేమ ఉంటే పార్లమెంటులో ప్రత్యేక సాయం కోసం కేంద్రాన్ని ప్రశ్నించాలన్నారు.స్వతంత్ర భారతదేశంలో తొలిసారి చేనేత పై పన్ను వేసిన పాపపు ప్రభుత్వం బిజెపిదేనన్నారు.కరోనా సంక్షోభం లోనూ టెక్స్టైల్ పరిశ్రమ పై పన్నులు బాదింది భాజపా సర్కార్ అని మండిపడ్డారు కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news