Breaking : ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థులపై నాన్‌బెయిలబుల్‌ కేసులు

-

ఏఐసీసీ నేత రాహుల్‌ గాంధీ ఈ నెల 6, 7 తేదీలలో తెలంగాణలో పర్యటించనున్నట్లు తెలంగాణ కాంగ్రెస్‌ ఇప్పిటికే ప్రకటించింది. అయితే రాహుల్‌ గాంధీ ఓయూలో కూడా పర్యటించేందుకు ఓయూ వీసీని అనుముతులు కోరగా నిరాకరించారు. దీంతో భగ్గుమన్న ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థులు అడ్మినిస్ట్రేషన్‌ బిల్డింగ్‌ను ముట్టడించారు. అంతేకాకుండా అడ్మినిస్ట్రేషన్ కార్యాలయం అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులువారిని అరెస్ట్‌ చేశారు.

NSUI Meghalaya dissolved due to anti-party activities of a few: Lyngdoh

అయితే.. మహిళా పోలీసులతో ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థలు అసభ్యంగా ప్రవర్తించారంటూ పోలీసులు వారిపై నాన్‌బెయిలబుల్‌ కేసులు నమోదు చేశారు. అయితే ఈ నేపథ్యంలో అరెస్టైన విద్యార్థులను పరామర్శించేందుకు బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లిన టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డిని సైతం పోలీసులు అరెస్ట్‌ చేశారు. దీంతో కాంగ్రెస్‌ నేతలు మధు యాష్కీ గౌడ్‌, గీతారెడ్డిలు బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news