అమిత్‌షా కుటుంబంపై మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

-

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా కుటుంబం పై మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కుటుంబ పాలనపై అమిత్‌షా మాట్లాడడం హాస్యాస్పదం‌ అని మండిపడ్డారు. ‘పూర్తిగా మెరిట్‌ ఆధారంగా ర్యాంకులను సాధించి బీసీసీఐ సెక్రెటరీగా ఎదిగిన ఓ కుమారుడి తండ్రి తెలంగాణ పర్యటనకు వచ్చారని వెల్లడించారు.

ఇక ఆ తండ్రి.. సౌమ్యుడి కోసం ప్రచారం చేస్తున్నారని ఓ రేంజ్‌ లో ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్‌. అన్న ఎంపీగా పదవిలో కొనసాగుతుండగా, భార్య ఎమ్మెల్సీగా పోటీ చేసిన వ్యక్తి తరఫున ప్రచారం చేయడానికి వచ్చారన్నారు. అలాంటి తండ్రి.. కుటుంబ పాలన రద్దు చేయాల్సిన అవసరంపై మనకు హితబోధ చేస్తారని చురకలు అంటించారు కేటీఆర్.

ఇది ఇలా ఉండగా కేసీఆర్ కుటుంబం చాలా పెద్దదని.. వాళ్లు అధికారంలో ఉన్నందునే రాష్ట్ర ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని మునుగోడు బీజేపీ సభలో అభిప్రాయపడ్డారు అమిత్‌ షా. కాళేశ్వరం ప్రాజెక్టు ఆ కుటుంబానికి ఏటీఎంలా మారిందని ఆరోపించారు అమిత్‌ షా. పెట్రోల్ ధరలు మోడీ సర్కారు రెండుసార్లు తగ్గించినా.. కేసీఆర్ సర్కారు తగ్గించలేదని గుర్తు చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువున్న రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉందని అమిత్‌ షా చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news