పరిశ్రమల విషయంలో జగన్ సర్కార్ కొత్త ప్లాన్!

-

తనను నమ్మిన తాన్ను నమ్మిన జనాలకు గత ఐదేళ్ల పాలనలో పడిన కష్టాల నుంచి కాస్తైనా ఉపశమనం లభించాలంటే… ముందుగా సంక్షేమంపై దృష్టిపెట్టాలని భావించినట్లున్నారు జగన్. అందులో భాగంగానే మొదటి ఏడాది అంతా పూర్తిగా సంక్షేమంపై దృష్టి పెట్టి, ఆ విషయాలను, పథకాల అమలును సెట్ చేసి పెట్టారు. ఇక రెండో ఏడాది నుంచి ఆ పనులు సంబందింత శాఖా మంత్రుల అధీనంలో హాయిగా కొనసాగిపోతాయి. ఇలా సంక్షేమం సెట్ అయిపోయింది కాబట్టి… ఇక అభివృద్ధిపై దృష్టి సారించాలన్ని జగన్ నిర్ణయించారంట. ఇందులో భాగంగా కొత్త పారిశ్రామిక విధానాన్ని తేనున్నాది జగన్ సర్కార్.

పరిశ్రమలకు అనువైన విధానాలను, అనుకూల వాతావరణాలను సృష్టించే పనిలో భాగంగా… ఈ నెల 26న నూతన పారిశ్రామిక విధానాన్ని ఖరారు చేయనున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి తెలిపారు. ఆయన నేతృత్వంలో తాజాగా జరిగిన ఇండస్ట్రియల్ టాస్క్‌ ఫోర్స్ భేటీలో నూతన పారిశ్రామిక పాలసీ పై చర్చించారు. నాలుగు రంగాల్లో ప్రాధాన్యం ఇచ్చేలా పాలసీ రూపొందిస్తామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. ఈ కొత్త విధానం ద్వారా పరిశ్రమలకు 30 రోజుల్లో అనుమతులు ఇచ్చే విధానం తీసుకువస్తున్నామని గౌతం రెడ్డి పేర్కొన్నారు. పరిశ్రమలకు స్థలం, నీరు, విద్యుత్, స్కిల్డ్ మ్యాన్ పవర్ కూడా అందిస్తామని ఈ సందర్భంగా పరిశ్రమల శాఖా మంత్రి మేకపాటి క్లారిటీ ఇచ్చారు.

ఈ నెల 26న తీసుకురాబోయే నూతన పారిశ్రామిక విధానంలో ఎలాంటి అవినీతికి ఆస్కారం ఉండదని.. అలాంటి పారిశ్రామిక పాలసీనే తీసుకొస్తున్నామని మేకపాటి వెల్లడించారు. రాష్ట్రంలో పారిశ్రామిక రంగంలో పెట్టుబడులు, ఉద్యోగాలతో పాటు పర్యావరణానికి ప్రాధాన్యం ఇస్తామని.. అందులో భాగంగానే పర్యావరణానికి హాని చేసే పరిశ్రమలకు అనుమతులు ఇవ్వొద్దని సీఎం జగన్‌ స్పష్టం చేశారని మంత్రి గౌతం రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని వనరులను సమర్థవంతంగా వినియోగిస్తామని.. ఈ విషయంలో రాజీపడే ప్రసక్తి లేదని గౌతం రెడ్డి స్పష్టం చేశారు. దీంతో… ఇకపై పరిశ్రమలను ఆకర్షించడం, స్థానికంగా యువతకు ఉద్యోగాలు కల్పించడం వంటి విషయాలపై జగన్ సర్కార్ దృష్టి సారించబోతోందని అర్ధం అవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు!

Read more RELATED
Recommended to you

Latest news