సొంత వాళ్లే రేవంత్ దూకుడుకు బ్రేక్ వేస్తున్నారా?

-

సాధారణంగా కాంగ్రెస్‌లో ఉండే అంతర్గత ప్రజస్వామ్యం, వేరే ఏ పార్టీలో ఉండదనే చెప్పొచ్చు. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చాలా స్వేచ్ఛగా మాట్లాడేస్తుంటారు. సొంత పార్టీపైనే బహిరంగంగా విమర్శలు చేస్తుంటారు. ఇలా చేయడంలో సొంత పార్టీకే అనేకసార్లు డ్యామేజ్ జరుగుతూ వచ్చింది. పీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి కానంత వరకు, కాంగ్రెస్‌లో అదే జరిగింది. అందుకే కాంగ్రెస్ రేసులో వెనుకబడింది.

రేవంత్ రెడ్డి | Revanth Reddy
రేవంత్ రెడ్డి | Revanth Reddy

కానీ రేవంత్ వచ్చాక దూకుడుగా రాజకీయాలు చేయడం మొదలుపెట్టారు. అధికార టీఆర్ఎస్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కేసీఆర్‌ని గద్దె దించడమే లక్ష్యంగా రేవంత్ పనిచేయడం మొదలుపెట్టారు. అలాగే ప్రజా సమస్యలపై పోరాటం కూడా చేస్తున్నారు. అదే సమయంలో ఇతర పార్టీలకు చెందిన నాయకులని కాంగ్రెస్‌లో చేర్చుకునేందుకు సిద్ధమవుతున్నారు.

ఇప్పటికే రేవంత్…డి. సంజయ్, ఎర్రశేఖర్, గండ్ర సత్యనారాయణ, కొండా విశ్వేశ్వర్ రెడ్డిలని కలిశారు. వారు కూడా కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఇలా బలమైన నాయకులని పార్టీలో చేర్చుకుంటే, పార్టీకే బెనిఫిట్ అవుతుంది. కానీ ఆ కార్యక్రమానికే కొందరు సీనియర్లు అడ్డుపడుతున్నట్లు తెలుస్తోంది. ఇలా పార్టీలో వేరే నాయకుల చేరికలపై కూడా కమిటీ వేయాలని నిర్ణయించుకున్నారు. ఇతర పార్టీ నేతలు చేరికలకు సంబంధించి పీసీసీ మాజీ చీఫ్‌ అధ్యక్షతన ఒక కమిటీని వేయాలన్న నిర్ణయానికి వచ్చారు. ఆయా నేతల చేరికల ప్రతిపాదనలపై కమిటీ స్థానిక నేతలతో చర్చించి టీపీసీసీకి చెప్పాలని నిర్ణయించారు.

అయితే ఇలా ఇతర పార్టీ నేతలు చేరికపై కూడా కమిటీలు వేసి, దాన్ని ధీర్ఘకాలం పొడిగించుకుంటూ పోతే వచ్చే నేతలు కూడా రారని, కాంగ్రెస్ శ్రేణులు అంటున్నాయి. బలమైన నాయకులు వచ్చేప్పుడు కమిటీలు వేసి, మీటింగులు పెట్టుకోవడం వల్ల ఉపయోగం లేదని అంటున్నారు. ఈ నిర్ణయాన్ని కూడా రేవంత్‌కు వదిలేస్తే మంచి ఫలితం వస్తుందని, లేదంటే అంతే సంగతులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news