రైతు సర్కార్‌గా తెలంగాణ ప్రభుత్వం : మంత్రి నిరంజన్‌ రెడ్డి

-

గద్వాల వ్యవసాయ మార్కెట్ యార్డ్ నూతన పాలకమండలి సభ్యుల ప్రమాణ స్వీకారం శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపట్టిన రైతు సంక్షేమ కార్యక్రమాల వల్ల తెలంగాణలో రైతులు ఆర్థిక అభివృద్ధిని సాధిస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సారధ్యంలో తెలంగాణలోని రైతులకు పంట పెట్టుబడి కింద ప్రతి పంటకు ఎకరాకు రూ. 5వేలు ఇస్తున్నారని మంత్రి నిరంజన్‌ రెడ్డి తెలిపారు.

రైతు బీమా అందజేస్తూ రైతు కుటుంబాలను ఆదుకుంటున్నారని వెల్లడించారు మంత్రి నిరంజన్‌ రెడ్డి. రైతు బంధు పథకం దేశానికి ఆదర్శంగా నిలిచిందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 2022 నాటికి 64 లక్షల మంది రైతులకు రైతుబంధు సకాలంలో అందుతున్నదని మంత్రి తెలిపారు. రైతు సర్కార్‌గా పేరుగాంచిన తెలంగాణ ప్రభుత్వం నిరంతరం రైతుల అభివృద్ధికే పనిచేస్తుందని అన్నారు మంత్రి నిరంజన్‌ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news